విదేశీ ప్రయాణీకులకు కేంద్రం గుడ్ న్యూస్..ఇకపై పాస్ పోర్ట్ లతో పాటు “కోవిన్ సర్టిఫికెట్”

కరోనా మహామ్మారి కారణంగా ఎంతో మంది భారతీయులు స్వదేశానికి వచ్చిన విషయం విధితమే.అందులో కొందరు విద్యార్ధులు ఉండగా మరికొందరు వ్యాపారస్తులు, ఇంకొందరు ఉద్యోగాలు చేసుకునే వారు, అత్యవసర పనులపై విదేశాలు వెళ్ళే వారు ఇలా ఎంతో మంది భారత్ లో ఉండిపోయారు.

 Cowin Certificates Linked With Passports For Foreign Travel, Cowin Certificate,-TeluguStop.com

పైగా త్వరలో జపాన్ లో ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి భారత్ నుంచీ ఎంతో మంది వెళ్లనున్నారు.అయితే ఆయా దేశాలు విధిస్తున్న కరోనా ఆంక్షలు నేపధ్యంలో కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.

భారత నుంచీ విదేశాలు వెళ్ళే వారికి తప్పకుండా ఆయా దేశాలు విధించిన నిభందనలకు అనుగుణంగా ప్రయాణాలకు సిద్దం అవ్వాలి.ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్ తప్పకుండా అయ్యి ఉండాలి అలాగే ఆయా దేశల నుంచీ అనుమతుల పత్రాలు తప్పకుండా ఉండాలి.

ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం చదువుకునే వారికోసం.అలాగే తాజాగా జరగనున్న ఒలంపిక్స్ కోసం కొత్త విధానం అమలులోకి తెచ్చింది.దీని ప్రకారం, విదేశాలు వెళ్ళే వారి పాస్ పోర్ట్ లకు కోవిన్ సర్టిఫికెట్ జత చేస్తే సరిపోతుందని తెలిపింది.అంతేకాదు కోవీ షీల్డ్ వ్యాక్సిన్ టైప్ తప్ప మిగిలినవి అవసరం లేదని తెలిపింది.

ఈ నిభంధనతో ఇకపై పాస్ పోర్ట్ లకు #8216, #8217 కోవిన్ సర్టిఫికెట్ కి అనుసంధానం చేస్తారు.ఇదిలాఉంటే

Telugu Foreign Travel, Nri-Telugu NRI

ఇలా విదేశాలు వెళ్ళే వారికి వ్యాక్సినేషన్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ సైతం ఆదేశాలు జారీ చేశారు.మరీ ముఖ్యంగా ఒలంపిక్స్ కు వెళ్ళే వారికి, వారి కోచ్ లకు వ్యాక్సిన్ వేయించాలని కేంద్రం కీలక సూచనలు చేసింది.ఇక విదేశాలు వెళ్లాలనుకునే విద్యార్ధులకు వారి వారి ప్రాంతాలలో ప్రత్యేకంగా వ్యాక్సిన్ కౌంటర్ లు ఏర్పాటు చేశారు.

వారందరికీ పాస్ పోర్ట్ లకు కోవిన్ సర్టిఫికెట్ అనుసంధానం చేసి ఉంటుందని వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయని కేంద్రం భరోసా ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube