ఆన్‌లైన్ క్లాసులే కదా… మీ దేశం వెళ్లిపోండి: విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్  

Foreign Students Whose Classes go fully online "Must Depart Country": US, Foreign Students, US, Online Classes, Non Immigrant Students - Telugu Foreign Students, Foreign Students Whose Classes Go Fully Online \"must Depart Country\": Us, Non Immigrant Students, Online Classes, Us

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.లక్షలాది మంది అమెరికన్లు ఇప్పటికే వైరస్ బారినపడగా.లక్షా పాతిక వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.కోవిడ్ 19తో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ట్రంప్ ఇప్పటికే విదేశీయుల రాకపై ఆంక్షలు విధించారు.

 Foreign Students Online Classes Must Depart

తాజాగా ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి విదేశీ విద్యార్ధులు కూడా చేరిపోయారు.

కోవిడ్ 19 కారణంగా పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు మొగ్గుచూపినట్లయితే విదేశీ విద్యార్థులు తమ దేశాన్ని విడిచి వెళ్లాల్సి వుంటుందని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆన్‌లైన్ క్లాసులే కదా… మీ దేశం వెళ్లిపోండి: విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా క్లాసులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో ఏ మూలనున్నా చదువుకోవచ్చనే ఉద్దేశంతో స్టూడెంట్ వీసాలను అమెరికా రద్దు చేసింది.

అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్ధులకు నాన్ ఇమ్మిగ్రెంట్ ఎఫ్-1, ఎం- 1 వీసాలను అక్కడి ప్రభుత్వం జారీ చేస్తుంది.ఐసీఈ ప్రకటన ప్రకారం.ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు వీసా జారీ చేయరు.

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా మీద ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్ క్లాసుల్లో పాల్గొంటున్న వారు దేశం విడిచి వెళ్లాల్సి వుంటుంది.అయితే, అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మాత్రం.

స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి వున్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలని ఐసీఈ వెల్లడించింది.

కాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత విద్యార్ధులపై పెను ప్రభావం చూపనుంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) లెక్కల ప్రకారం 2018- 2019 విద్యా సంవత్సరానికి గాను అమెరికాలో 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.వీరిలో చైనా తర్వాత స్థానంలో భారతీయులే ఉన్నారు.

మరోవైపు విదేశీ విద్యార్ధులపై ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.

#Online Classes #US

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Foreign Students Online Classes Must Depart Related Telugu News,Photos/Pics,Images..