కెనడా ఇమ్మిగ్రేషన్: శాశ్వత నివాస దరఖాస్తుకు బయోమెట్రిక్ తప్పనిసరి

కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విదేశీయులు ఇక నుంచి బయోమెట్రిక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 Foreign Nationals Biometrics Permanent Residence-TeluguStop.com

డిసెంబర్‌ 3కి ముందు, కెనడా వెలుపలి నుంచి దరఖాస్తు చేసుకున్న ఇమ్మిగ్రేషన్ అభ్యర్థులు మాత్రమే బయోమెట్రిక్‌ ద్వారా వారి వేలిముద్రలు, ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది.

వర్క్ వీసా, స్టడీ వీసా, విజిట్ వీసాతో పాటు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారు బయోమెట్రిక్ సమర్పించాల్సి ఉంటుంది.

ఒకవేల కెనడాలో వీసాను పొడిగించడం కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే వారి బయోమెట్రిక్ చెల్లుబాటు అవుతుందా, లేక మరోసారి వేలిముద్రలు సమర్పించాలో లేదో ఆయా కేంద్రాలలో తెలుసుకోవచ్చు.కెనడాలోని 58 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల జాబితాను ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ మరియు పౌరసేవల (ఐఆర్‌సీసీ) వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

బయోమెట్రిక్ విధానం ద్వారా కెనడా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ యొక్క సామర్ధ్యాన్ని, సమగ్రతను పెంచుతుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ మరియు పౌరసత్వ శాఖ మంత్రి మార్కో మెండిసినో ఒక ప్రకటనలో తెలిపారు.వేలిముద్రలు, ఫోటో సేకరణ ద్వారా ప్రజలను వేగంగా గుర్తించవచ్చని.

ఇది అత్యంత నమ్మదగిన విధానమని, ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు బయోమెట్రిక్ విధానాన్ని వినియోగిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

Telugu Telugunri-

గతేడాది డిసెంబర్ 31 నుంచి తాత్కాలిక లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల యొక్క బయోమెట్రిక్‌లను కెనడా సేకరించింది.అయితే మరింత అవగాహన కోసం ఐఆర్‌సీసీ ఆన్‌లైన్‌లో ఒక ప్రశ్నపత్రాన్ని ఉంచింది.దీని ద్వారా తాము బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదో విదేశీయులు తెలుసుకోవచ్చు.14 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఫ్యామిలీ క్లాస్, ఎననామిక్ క్లాస్, శరణార్థుల క్లాస్‌లకు చెందిన వారు శాశ్వత నివాసం కోసం వేలిముద్రలు, ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది.

విజిట్ వీసా, స్టడీ వీసాతో పాటు వర్క్ వీసా‌ల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో బయోమెట్రిక్ ఇచ్చినప్పటికీ తాజా ఆదేశాల ప్రకారం మళ్లీ వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇదే సమయంలో కెనడా పౌరులు, ప్రస్తుత శాశ్వత నివాసితులు బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube