గుజరాత్ : హవాలా మార్గంలో విదేశీ నిధుల దుర్వినియోగం .. తీగలాగుతున్న వడోదరా పోలీసులు

విదేశీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సలావుద్దీన్ షేక్, మహ్మద్ ఉమర్ గౌతమ్‌ల రిమాండ్ పొడిగించేందుకు వడోదర కోర్టు శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అనుమతినిచ్చింది.వడోదరా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఎఫ్ఎంఐ) ఛారిటబుల్ ట్రస్ట్‌.

 Foreign Funds Misuse Case: Vadodara Court Extends Sheikh,gautam’s Remand By 4-TeluguStop.com

విదేశీ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటోంది.ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించారు ఉన్నతాధికారులు.

2017 నుంచి ఏఎఫ్ఎంఐ ట్రస్ట్‌కు చెందిన రూ 60 కోట్లు, రూ.19 లక్షల నిధులను వీరు హవాలా మార్గంలో స్వాహా చేశారన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.సిట్ కోర్ట్‌కు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం.ఘజియాబాద్ సమీపంలోని నిర్వాసితులైన బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింల కోసం ఇండో – నేపాల్ సరిహద్దులో 400 ఫ్లాట్ల నిర్మాణంతో పాటు ఇస్లామిక్ కార్యకలాపాలకు నిందితులు ఈ డబ్బును వినియోగించాలని భావించారని తెలిపింది.

దీనితో పాటు ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారికి ఆర్ధిక సాయం, ఇండో- నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో, కాశ్మీర్‌లోని స్థానిక మౌలావీలు, సామాజిక కార్యకర్తలకు సహాయం అందించడంతో పాటు ఏడు రాష్ట్రాలలో 100 మసీదుల నిర్మాణానికి కూడా వీరు నిధులు అందజేస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమాలన్నింటి వెనుక కోట్లాది రూపాయల పన్ను ఎగవేతతో పాటు మనీలాండరింగ్ వంటి భారీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో ప్రత్యేక ఏజెన్సీల విచారణ చేపట్టాలని సిట్ అధికారులు కోరుతున్నారు.ఈ కేసులో భాగంగా ఏఎఫ్ఎంఐ మేనేజింగ్ ట్రస్టీ షేక్, ఉమర్ గౌతమ్ సహచరులను విచారించేందుకు ఇప్పటికే సమన్లు జారీ చేశారు.

దీనికి వారు స్పందించడం లేదని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

ఏఎఫ్ఎంఐ ట్రస్ట్‌తో సంబంధాలున్న నబీపూర్‌కు చెందిన అబ్ధుల్లా ఫెఫ్దావాలాకు కూడా సిట్ సమన్లు పంపింది.

హవాలా నిధులను షేక్‌కు పంపించడంలో సహాయపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త ముస్తఫా థానవాలా, కిడెన్ జోహర్ ధోక్లావాలా అనే వ్యక్తికి సమన్లు జారీ చేశారు.అక్రమ నిధులపై విచారణ జరిపేందుకు గాను ప్రొఫెషనల్ ఛార్టర్డ్ అకౌంటెంట్‌ను కూడా వడోదరా సిట్ నియమించింది.

ఏకకాలంలో విచారణ ప్రారంభించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.వడోదరా కోర్ట్ జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్‌కు అనుగుణంగా షేక్, గౌతమ్‌లను అక్టోబర్ 16న లక్నో సెంట్రల్ జైలు నుంచి వడోదరాకు తీసుకొచ్చారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube