బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధం కోసం ఇలా చేస్తే సరి..!

మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడు తున్నారు.వ్యాయామం లేకపోవడం కూడా దీనికి కారణమే.

 For Those Who Want To Lose Weight, It Is Ok To Do This For Divine Medicine , Cow-TeluguStop.com

దీంతో నలుగురిలో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు.కొందరైతే సొంత పనులు చేసుకోవడానికి కూడా కష్ట పడుతుంటారు.

బరువు తగ్గడానికి మరికొందరు ఆహారం మానేస్తారు.అయితే అలాంటి పని వల్ల మరిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

శరీరానికి బలాన్నిచ్చే పాలను తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా ఆవు పాలను తాగితే బరువు తగ్గడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం సాధ్య పడుతుందని చెబుతున్నారు.

పాలు తాగితే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుందనే భావన అపోహ అని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.ఆవు పాలను నిరభ్యంతరంగా తాగొచ్చని సూచిస్తున్నారు.

పాలలో కాల్షియం, విటమిన్ బి12, డి, పొటాషియం, రిబోప్లేవిన్ వంటివి శరీరానికి అవసర మైనంత స్థాయిలో ఉంటాయి.రోజువారీ తినే ఆహారంలో పాలను కూడా చేర్చుకోవాలని, తద్వారా శరీరానికి పుష్కలంగా అన్ని పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు.

పాల వల్ల బరువు తగ్గడంతో పాటు జీవ క్రియ సాఫీగా జరుగు తుంది.అమెరికా పరిశోధకుల సాగించిన పరిశోధనలో 100 గ్రాముల ఆవు పాలలో కొవ్వు 3.25%, 61 కేలరీలు, కాల్షియం 113 మైక్రో గ్రాములు ఉంటాయని వెల్లడైంది.

బరువు తగ్గాలని ఆశపడే వారు ప్యాకెట్ పాలను దూరం పెట్టడం మంచిది.

అందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి.పాలను నిల్వ చేసేందుకు కంపెనీలు కొన్ని స్వీట్‌నర్, రసాయనాలు వాడతారు.

అందువల్ల అవి తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది.అయితే తాజా పాలను తాగితే ఏ సమస్యా ఉండదు.

దీంతో పాటు పాలలో పసుపు, అశ్వగంధ, దాల్చిన చెక్క వంటివి కలుపు కుంటే మెరుగైన ప్రయోజనం ఉంటుంది.

For Those Who Want To Lose Weight

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube