ఓహో ! ఆ భయంతో బాలయ్యను దూరం పెట్టేస్తున్నారా ?  

నందమూరి బాలకృష్ణ ! ఈ పేరే ఒక సంచలనం. సినిమా డైలాగులతో పాటు రాజకీయ డైలాగులను సైతం గుక్క తిప్పుకోకుండా చెప్పి ప్రజలను ఆకట్టుకునేలా బాలయ్య ప్రసంగాలు ఉంటాయి. హిందూపురం ఎమ్యెల్యేగా బాలయ్య రాజకీయాల్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం టీడీపీ లో బాలయ్య హవా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బాలయ్య ప్రచారం ఏపీ అంతా సాగింది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా బాలయ్య తో ప్రచారం చేయించుకునేందుకు పోటీలుపడ్డారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. మొన్న నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ , తెలంగాణ ఎన్నికల్లోనూ బాలయ్య ప్రచారాలు జోరుగా సాగినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు .

For The Reason Why Chandrababu Avoiding To Balaiah-Chandrababu Naidu Hindhupur Pawan Janasena Tdp Candidates List Ys Jagan

For The Reason Why Chandrababu Avoiding To Balaiah

ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు నుంచే తెలుగుదేశం తరఫున బాలయ్య ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలయిన బాలయ్య చప్పుడే వినిపించడం లేదు. సాధారణంగా టికెట్ల కేటాయింపు సమయంలో బాలయ్య పేరు బాగా వినిపిస్తుంది. బాలయ్య జాబితా ఒకటి బయటికి వస్తుంది. కానీ ఈసారి అటువంటి ఆబ్లిగేషన్స్ ఏవీ రాలేదు. కేవలం తన చిన్న అల్లుడు భరత్ కి విశాఖ ఎంపీ సీటు ఇవ్వమని కోరడం తప్ప మిగతా విషయాల్లో ఆయన కల్పించుకోవడంలేదు. బాలయ్యకు ప్రస్తుతం హిందూపురంలో ఎదురుగాలి బాగా వీస్తోందట. అందుకే అక్కడికి వెళ్లి అక్కడి వ్యవహారాలు చక్కబెట్టుకోవడమే సరిపోతోందట.

For The Reason Why Chandrababu Avoiding To Balaiah-Chandrababu Naidu Hindhupur Pawan Janasena Tdp Candidates List Ys Jagan

అదీ కాకుండా తెలంగాణ, అంతకుముందు నంద్యాల ఎన్నికల ప్రచారంలో బాలయ్య ఏది పడితే అది మాట్లాడి టీడీపీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాడు. ఆయన వల్ల పార్టీకి లాభం జరగకపోగ నష్టం అయితే బాగా జరిగింది. ఆ భయం టీడీపీ నాయకుల్లో ఇప్పటికీ బలంగా ఉంది. ఈసారి ఏపీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో బాలయ్యను ప్రచారంలోకి దింపితే ఏం మాాట్లాడి ఏం వివాదం తీసుకొచ్చి పార్టీకి నష్టం చేకూరుస్తాడో అన్న ఆందోళనతో బాలయ్యను కేవలం హిందూపురానికి పరిమితం చేయాలనీ టీడీపీ అధినేత భావించినట్టు సమాచారం.