ఇంటర్నెట్ యుగంలో ఇదో పెద్ద సంచలనం

ఓ ఐదేళ్ళు వెనక్కి వెళదాం.ఇంటర్నెట్ వాడాలంటే అయితే మన దగ్గర కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉండి, నెల మొత్తానికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.

 For The First Time, Mobile Internet Usage Beats Desktop Internet-TeluguStop.com

సొంత కంప్యూటర్ లేకపోతే గంటకి ఇంత అని చెల్లించి ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్ళాళ్సివచ్చేది.మరి ఇప్పుడో ? ఇంటర్నెట్ వాడాలంటే సొంత కంప్యూటర్ ఉండాల్సిన అవసరమే లేకపోయింది.మొబైల్ ఉంటే చాలు.

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగిపోతోంది.దీనికి కారణం స్మార్ట్ ఫోన్లు, టాబ్లేట్లు తెచ్చిన విప్లవమే.ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ డెస్క్ టాప్ ఇంటర్నెట్ ని ఎంతలా డామినేట్ చెస్తోందంటే, ఇంటర్నెట్ యుగం మొదలయ్యాక మొట్టమొదటి సారిగా, మొబైల్ ఇంటర్నెట్ వాడకం కంప్యూటర్ ఇంటర్నెట్ వాడకాన్ని దాటేసింది.

అవును, స్టాట్ కౌంటర్ తాజాగా విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఆక్టోబర్ వరకు ప్రపంచంలో ఇంటర్నెట్ వాడుతున్నవారిలో 51.3 శాతం మంది తమ మొబైల్ లేదా టాబ్లేట్ తోనే ఇంటర్నెట్ వాడుతున్నారట.ఇక మిగిలిన 48.7 శాతం మంది కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారట.అయితే, యుఎస్ మరియు యూకేలో మాత్రం ఇంకా కంప్యూటర్స్ దే హవా.

యూఎస్ లో 58 శాతం మంది, యూకేలో 56% మంది ఇంకా కంప్యూటర్ ద్వారానే ఇంటర్నెట్ వాడుతున్నారని ఫలితాలు చెప్పాయి.ఇక మనదేశంలో పరిస్థితి చెప్పనక్కరలేదు.మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ యూజర్లే ఎక్కువ.కాబట్టి, ఇప్పటికైనా వెబ్ సైట్లు మొబైల్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫెస్ తో వస్తే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube