మొటిమలు లేని మెరిసే చర్మం కోసం ఎఫెక్టివ్‌ టిప్స్‌..!!

సాధార‌ణంగా ప్రతి మనిషి త‌మ యవ్వన ప్రాయంలో ఎదుర్కొనే ప్ర‌ధాన చ‌ర్మ స‌మ‌స్య మొటిమలు.ఈ స‌మ‌స్యతో చాలా మంది బాధ‌ప‌డ‌తారు.

 For Pimples Free Shiny Skin With This Tips, Health Tips, Shiny Skin, Pimples, Le-TeluguStop.com

ఒత్తిడి, హార్మోన్ల స్థాయిల్లో మార్పులు, బ్యాక్టీరియా ఇలా మొటిమలు రావటానికి చాలా కార‌ణాలే ఉన్నాయి.అయితే అంద‌మైన‌, మెరిసే చ‌ర్మంపై చిన్న మొటిమ వ‌స్తే.

ఎంతో కంగారు ప‌డ‌తారు.ఈ క్ర‌మంలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నిస్తారు.

అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక అవేద‌న చెందుతారు.కానీ, ఇలాంటి సమస్యకు సహజసిద్ధమైన టిప్స్‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి టిప్స్ ఏంటో.ఓ లుక్కేసేయండి.

– మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో అలోవెరా(క‌ల‌బంద‌) గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.కాబ‌ట్టి, ఒక టీ స్పూన్ అలోవెరా జెల్‌లో చిటికెడు ప‌సుపు వేసి మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Alovera, Tips, Lemon, Pimples, Shiny Skin, Tumaric-Telugu Health

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటుంది.ఇది మొటిమల కారక బాక్టీరియాను న‌శింప‌చేస్తుంది.కాబ‌ట్టి, ఒక నిమ్మ పండు తీసుకోని సగానికి కట్ చేయాలి.ఆ కట్ చేసిన ముక్కతో మొటిమ‌ల‌పై రుద్దుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ప‌సుపు కూడా మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, ఒక టీ స్పూన్ ప‌సుపు తీసుకుని.అందులో కొద్దిగా పాలు పోసి మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Alovera, Tips, Lemon, Pimples, Shiny Skin, Tumaric-Telugu Health

– సహజ యాంటీ బాక్టీరియల్ అయిన తేనె మోటిమలను సులువుగా మాయం చేస్తుంది.కాబ‌ట్టి, రాత్రిపూట ప‌డుకునే ముందు కొద్దిగా తేనె తీసుకుని.మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.ఉద‌యం లేవ‌గానే చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.మొటిమ‌ల స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Telugu Alovera, Tips, Lemon, Pimples, Shiny Skin, Tumaric-Telugu Health

ఒక టీ స్పూన్ శెన‌గ‌పిండి మ‌రియు కొద్దిగా పెరుగు మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి అర‌గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube