నాలుగు తరాలుగా ఆ కుటుంబంలో అందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే..

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో నాలుగు తరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్న ఓలేటి బంగారేశ్వర శర్మ కుటుంబం. బంగారేశ్వర శర్మ కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి గ్రేడ్1 ఉపాధ్యాయుడిగాను, శాస్త్రి కుమారుడు శ్రీనివాస శర్మ కూడా ఉపాధ్యాయుడే.

 For Four Generations Everyone In That Family Is In The Teaching Profession In Ma-TeluguStop.com

విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమనే విశ్వసించి తాత తండ్రి స్ఫూర్తితో శ్రీనివాస శర్మ తన ఏడుగురు కుమారులను, ఇద్దరు కోడళ్లను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ధి ఔరా అనిపించారు.

పెద్ద కుమారుడు తెలుగు ఉపాధ్యాయుడిగా రెండవ కుమారుడు సంస్కృతిక సాహిత్య అధ్యాపకునిగా మూడవ కుమారుడు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా నాలుగో కుమారుడు ఎస్ జిటి గా ఐదో కుమారుడు వ్యాకరణ అధ్యాపకుడిగా ఆరో కుమారుడు తెలుగు ఉపాధ్యాయుడిగా ఏడవకుమారుడు గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

అలాగే మూడవ కుమారుడు భార్య రాజేశ్వరి ఆరో కుమారుడు భార్య వీరేశ్వరి కూడా టీచర్లే మొత్తం తొమ్మిది మంది ఆ కుటుంబంలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు.

Telugu Mammidivaram-Latest News - Telugu

శ్రీనివాస శర్మ కూతురు సుబ్బలక్ష్మి కుమారుడు అల్లుడు కూడా ఉపాధ్యాయుల కావడం విశేషం.నాలుగు తరాలుగా ఓలేటి వారి కుటుంబం ఉపాధ్యాయులుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.తన ఏడుగురు కుమారులు తండ్రి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని శ్రీనివాస శర్మ భార్య వెంకట సీతామహాలక్ష్మి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube