లియోనెల్ మెస్సిని వరిస్తున్న పురస్కారాలు... తాజాగా మరో అరుదైన గౌరవం!

లియోనెల్ మెస్సి…( Lionel Messi ) ఈ పేరు గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు( Argentina ) ఫిఫా వరల్డ్‌కప్‌ సాధించిన సంగతి అందరికీ తెలిసినదే.

 Football Star Leonel Messi Wax Statue At Canmebol Museum Details, Lionel Messi's-TeluguStop.com

ఈ ఘటన తరువాతే లియోనెల్ మెస్సి దాదాపుగా ఈ ప్రపంచానికి చాలా గ్రాండ్ గా పరిచయం అయ్యాడు.అప్పటివరకు అర్జెంటీనాకే పరిమితమైన అతని స్టార్ డం ఇపుడు ప్రపంచానికి తాకింది అనడంలో అతిశయోక్తి లేదు.

ఫిఫా వరల్డ్‌కప్‌( FIFA Worldcup ) సాధించి నేటికి దాదాపు 3 నెలలు కావస్తున్నా లియోనెల్ మెస్సి నామస్మరణ ఇంకా మారుమోగుతూనే ఉంది.

అవును, విషయం ఏమంటే… వరల్డ్‌కప్‌ సాధించినప్పటి నుంచి మెస్సీకి ఏదో ఒక రకంగా ఏదో ఒక చోట గౌరవ సత్కారాలు అందుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో తాజాగా సౌత్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెస్సీకి అరుదైన గౌరవంతో సత్కరించింది.సౌత్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ హెడ్‌క్వార్టర్స్‌ అయిన కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని చాలా అంగరంగ వైభవంగా ఆవిష్కరించింది.

ఈ తంతుని అక్కడే వున్న లియోనెల్ మెస్సి చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు.కాగా అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించినందుకు గానూ ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

ఇకపోతే ఫుట్‌బాల్‌లో దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీలే తర్వాత కాన్‌మిబోల్‌ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న 3వ ఆటగాడిగా మెస్సీ రికార్డు సాధించడం విశేషం.గతేడాది డిసెంబర్‌లో ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించిన అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకొని పెను సంచలనం సృష్టించింది.టోర్నీ ఆద్యంతం అంతా తానై నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బాల్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఇటీవలే బ్యూనస్‌ ఎయిర్స్‌లో పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-0తో విజయం సాధించిన సంగతి విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube