ముంబ రైల్వే స్టేషన్ ఘోర ప్రమాదం! కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్!  

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకి పరిహారం ప్రకటించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి. .

  • ముంబైలో చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ ప్రయాణికులు వెళ్ళే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోవడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకేసారిగా అధిక సంఖ్యలో ప్రయాణికులు దీనిపై నడవడం, అలాగే బ్రిడ్జ్ ఇప్పటికే ప్రమాదకరంగా మారిన అధికారులు పట్టించుకోక పోవడంతో ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఐదు మంది మరణించినట్లు తెలుస్తుంది. మొత్తం 40 తీవ్ర గాయాలకి గురైనట్లు సమాచారం.

  • ఇక బ్రిడ్జ్ ప్రమాదం గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ వెంటనే స్పందించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడం దురదృష్టకరం అని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణకి ఆదేశించినట్లు స్పష్టం చేసారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల పరిహారం అందిస్తామని తెలియజేసారు. ఇక ఈ ఘటన మీద వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తామని స్పష్టం చేసారు.