వర్షాకాలంలో పాదాలను సంర‌క్షించే ఇంటి చిట్కాలు ఇవే!!

వ‌ర్షాకాలం వ‌చ్చేసింది.మిగిలిన సీజ‌న్స్‌తో పోలిస్తే.

 Foot Care Tips Rainy Season-TeluguStop.com

వ‌ర్షాకాలంలో అంటువ్యాధుల‌తో పాటు అనేక స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.అందులోనూ ఈ కాలంలో పాదాలు బాగా ఎఫెక్ట్ అవుతుంటాయి.

బురద, వర్షపు నీటిలో నడవడం వల్ల బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకి తామర, దురద, మంట, ఎరుపుదనం, ప‌గుళ్లు ఇలా అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 Foot Care Tips Rainy Season-వర్షాకాలంలో పాదాలను సంర‌క్షించే ఇంటి చిట్కాలు ఇవే-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే.ఇప్పుడు చెప్ప‌బోయే ఇంటి చిట్కాలు పాటిస్తే.పాదాల‌ను సంర‌క్షించుకోవ‌చ్చు.ముందుగా ఒక‌ ట‌బ్‌లో గోరువెచ్చ‌ని నీరు తీసుకుని.అందులో ఉప్పు మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లపాలి.ఇప్పుడు పాదాల‌ను ప‌ది నిమిషాల పాటు ఆ నీటిలో ఉచ్చి.అనంత‌రం క్లీన్ చేసుకోవాలి.మీరు బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చాక‌.

ఇలా చేస్తే పాదాలపై ఉన్న బాక్టీరియా నాశ‌నం అవ్వ‌డంతో పాటు.పాదాల నుంచి వ‌చ్చే దుర్వాసన కూడా త‌గ్గుతుంది.

అలాగే వేపాకు కాళ్ళ పగుళ్ళను పూర్తిగా నివారించడానికి సహాయపడుతుంది.అదేవిధంగా, బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోక‌కుండా ర‌క్షిస్తుంది.కాబ‌ట్టి, కొన్ని వేపాకులు తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.ఈ పేస్ట్‌ చేసి పాదాల‌కు ప్యాక్‌లా వేసి.అర‌గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌దాల నొప్పి, దురద స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

ఇక ప్ర‌తిరోజు రాత్రి నిద్రించే ముందు పాదాల‌కు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి ప‌డుకుంటే.ఇది మంచి మాయిశ్చరైజర్‌గా ప‌నిచేస్తుంది.త‌ద్వారా ప‌దాలు మృదువుగా, అందంగా ఉంటాయి.అలాగే పసుపును కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, ప‌సుపులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి.పాదాల‌కు అప్లై చేయాలి.

పావు గంట త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఫంగస్‌ను నివారించవచ్చు.

.

#Home Remedies #Rainy Season #HomeRemedies #Foot Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు