తక్కువ వయస్సు మనిషిలా కనపడాలంటే ఇలాంటి ఆహారం తీసుకోవాల్సిందే...!

మనం ఆరోగ్యంగా ఉండడానికి వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాం.ఇలా తీసుకున్న ఆహారం వల్ల నిజంగా మేలు చేకూరుతుంద లేకపోతే ఏదైనా చెడు కలుగుతుందా అనే విషయాన్ని చాలామంది గమనించరు.

 Foods Young Look Healthy Diet-TeluguStop.com

ఇకపోతే చాలామంది ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా అనేకరకాలుగా వారి ఆహారపు అలవాట్లను మార్చేస్తున్నారు.వీటి వల్ల కొందరు ఆరోగ్యంగా కనిపిస్తున్న, మరికొందరు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇకపోతే ఇలాంటి విషయాలను ఎలా అధిగమించాలన్న విషయానికి వస్తే.

 Foods Young Look Healthy Diet-తక్కువ వయస్సు మనిషిలా కనపడాలంటే ఇలాంటి ఆహారం తీసుకోవాల్సిందే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటగా ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి మన పనులను మనం చేసుకోవడం చాలా మంచి అలవాటు.

ఇలా లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత గ్లాసు లో కాస్త గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, అలాగే తేనె కలుపుకుని తాగడం ద్వారా మన శరీర భాగాలను ఆ గోరువెచ్చని నీరు ఎంతగానో శుభ్రపరుస్తాయి.ఆ తర్వాత ఓ గంటపాటు కచ్చితంగా వ్యాయామం లేదా యోగ లాంటి ప్రక్రియలను ఖచ్చితంగా చేయాలి.

ఇలా చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న కొవ్వు కాస్తా చెమట రూపంలో బయటికి వస్తుంది.ఆ తర్వాత అల్పాహార సమయంలో వీలైనంత వరకు ఆయిల్ ఐటమ్స్ తగ్గించి మొలకెత్తిన గింజలు, పండ్లు లాంటివి ఎక్కువ తీసుకోవడం మంచిది.

ఇక అలాగే కాఫీ, టీలకు బదులుగా ప్రస్తుతం వస్తున్న గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలు తీసుకోవడం ద్వారా శరీరంలో కాస్త రక్తం శుద్ధి జరుగుతుంది.అంతేకాదు పండ్లు ను తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక మొత్తంలో శక్తి లభిస్తుంది.

ఇక మధ్యాహ్న భోజన సమయానికి వస్తే… కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకొని అధిక మొత్తంలో కూరగాయలు, మీగడ లేని పెరుగును తీసుకునేలా ప్రయత్నించండి.భోజనం తర్వాత వీలైతే కచ్చితంగా అరటి పండు తినడం అలవాటు చేసుకోండి.

ఈ అరటిపండు మన శరీరంలో ఉండే జీవక్రియ రేటును బాగా మెరుగుపరుస్తుంది.ఇక సాయంత్రం పూట స్నాక్స్ గా ఏవైనా ఉడకబెట్టిన గింజలను తీసుకుంటూ కాస్త తక్కువ పరిమాణంలో కాఫీ లేదా టీ లను తాగవచ్చు.

ఇక రాత్రి పడుకునే ముందు చపాతీ లేదా కొద్ది మొత్తంలో మాత్రమే రైస్ ను తీసుకోవాలి.అదికూడా పడుకునే ముందు ఓ గంట కంటే ముందే భోజనం చేసేలా చూసుకోవాలి.

వీటితో పాటు వీలైనంతవరకు మైక్రోఓవెన్ లో వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండేందుకు చూసుకోవాలి.ఇలా మిత ఆహారం పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చాలా యవ్వనంగా కనిపిస్తాము.

#Healthy Food #Honey #FoodsTo #Diet #Drinks

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు