ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ ఉండదు తెలుసా..!  

Foods With No Expiry Dates -

మనకు ఏదైనా నొప్పి వచ్చిందంటే మెడిసిన్స్ వేసుకుంటాం.వాటికీ ఎక్స్‌పైరీ ఉంటుంది.

అలాగే మనం వాడే చాలా వస్తువులకు ఎక్స్‌పైరీ ఉంటుంది.ఆ ఎక్స్‌పైరీ దాటిందంటే ఇక ఆ వస్తువు వాడటానికి ఉపయోగపడదు.

Foods With No Expiry Dates-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

కానీ మనం రెగ్యులర్ వాడే కొన్ని వస్తువులకు ఎక్స్‌పైరీ ఉండదు.వాటిని ఎన్ని సంవత్సరాలు అయినా ఉపయోగించవచ్చు.

తేనే
తేనె ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరించటంలో సహాయాపడుతుంది.తేనెకు మాత్రం ఎక్స్‌పైరీ ఉండదు.

ఎన్ని సంవత్సరాలు అయినా వాడవచ్చు.కానీ ప్యాకింగ్ తేనే మాత్రం ఆలా ఉండదు.

సహజ సిద్ధమైన తేనెను అప్పటికప్పుడు సేకరించి నిల్వ చేస్తే ఎన్ని సంవత్సరాలు అయినా పాడవకుండా అలానే ఉంటుంది.

బియ్యం
ముడి బియ్యం (బ్రౌన్ రైస్‌) కొన్ని రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటాయి.

కానీ పాలిష్ చేసిన తెల్ల బియ్యం అలా కాకుండా ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ ఉంటుంది.కాకపోతే ఆ బియ్యాన్ని గాలి చొరబడని డబ్బాలు, సంచుల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది.

ఉంటుంది.లేదంటే పురుగులు ప్రవేశించి బియ్యాన్ని పాడు చేస్తాయి.

పంచదార
పంచదారలో బాక్టీరియా పెరగదు.కాబట్టి పంచదారను ఎంత కాలం నిల్వ ఉంచినా పాడవ్వదు.

అయితే వాతావరణంలో ఉన్న తేమ‌ తగిలితే పంచదార గట్టి పడుతుంది.కనుక తేమ తగలకుండా గాలి చొరబడని డబ్బాలో ఉంచితే పంచదారను కూడా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.

ఉప్పు
ఉప్పు కూడా ఎన్ని సంవత్సరాల అయినా నిల్వ ఉంటుంది.పాడవదు.

ఇన్‌స్టంట్ కాఫీ
ఇన్‌స్టంట్ కాఫీకి కూడా ఎప్పటికీ తాజాగా ఉండే లక్షణాలు ఉంటాయట.అయితే డీప్ ఫ్రీజర్ లో పెట్టినప్పుడు మాత్రమే.

అలా ఉంచుకుని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చట.

పప్పులు
అన్ని రకాల పప్పు దినుసులు, సోయా, బీన్స్ జాతులకు చెందిన గింజలు కూడా ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటాయి.

వాటిల్లో పోషకాలు కూడా అలాగే ఉంటాయి.వీటిని ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ చేయవచ్చు.

అయితే పురుగులు పట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

మద్యం
ఎండ తగలకుండా చీకటిగా, పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ ఉంచితే మద్యం కూడా ఎన్నో సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు