గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ ఆహారం కంపల్సరి

Foods To Be Taken When You Are On Birth Control Pill

కండోమ్ తో సెక్స్ చేస్తే శృంగారాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నామని ఈరోజుల్లో గర్భనిరోధక మాత్రలు వాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది.కాని ఈ మందుల వలన ఎన్నోరకాల సైడ్ ఎఫెక్ట్స్ చవిచూడాల్సి వస్తుంది.

 Foods To Be Taken When You Are On Birth Control Pill-TeluguStop.com

స్త్రీ శరీరంలో హార్మోనులు బ్యాలెన్స్‌ తప్పుతాయి.సమస్యలు తీవ్రతరం కాకూడదంటే, కొన్ని రకాల ఆహారం తినడం ఎంతైనా అవసరం.

* గర్భనిరోధక మాత్రలు వేసుకున్నాక హార్మోనులు బ్యాలెన్స్‌ తప్పడం జరుగుతుంది.దీని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా, ప్రభావం తగ్గాలంటే శరీరానికి ఒమెగా -3 ఫాట్టి ఆసిడ్స్ తో పాటు ఫోలేట్స్ అవసరం.

 Foods To Be Taken When You Are On Birth Control Pill-Foods To Be Taken When You Are On Birth Control Pill-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు అవొకాడోలో దొరుకుతాయి.

* బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకున్నాక హార్మోన్స్ పద్ధతి తప్పడం వలన స్త్రీలలో మూడ్ స్వింగ్స్ బాగా పెరిగిపోతాయి.

మూడ్ స్వింగ్ ని కంట్రోల్ లో పెట్టాలంటే సెరోటొనిన్ లెవెల్స్ పెరగాలి.అలా జరగాలంటే విటమిన్ b-6 అవసరం ఉంటింది.

ఆ అవసరాన్ని అరటిపండు తీరుస్తుంది.

* గర్భనిరోధక మాత్రలు వాడటం వలన జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

కాబట్టి విటమిన్-ఈ ఎక్కువగా దొరికే చేపలను తినాలి.అలాగే చర్మ సంబంధింత సమస్యలు కంట్రోల్ లో పెట్టడానికి ఆల్మండ్స్ తీసుకోవాలి.

రుచి కూడా కావాలంటే అరెంజ్ తినడం బెటర్.

* బర్త్ కంట్రోల్ పిల్స్ వలన శరీరంలో మెగ్నీషియం తగ్గిపోతుంది.

ఈ సమస్యకు పరిష్కారం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తినడం.

* గర్భనిరోధక మాత్రాలు వేసుకున్నవారికి తలనొప్పి రావచ్చు.

అదే జరిగితే పెరుగుతో తినండి.పెరుగులో ఉండే విటమిన్ – బి మరియు ప్రొబయోటిక్స్ ఉపశమనాన్ని కలిగిస్తాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube