లూజ్ మోషన్స్ తో ఇబ్బందా? ఇవిగోండి చిట్కాలు  

Foods To Be Taken To Cut Loose Motion Down -

ఇంఫెక్షన్స్ వలనో, తిన్న ఆహారం వలనో మోషన్స్ మొదలవడం చూస్టుంటాం.ఇది ఒక టెంపరరీ సమస్యే అయినా, ఉన్న కొద్దిరోజులు నరకం స్పెలింగ్ రాయిస్తుంది.

ఉన్నచోట ఉండనివ్వదు, ఓ పట్టాన సుఖంగా కూర్చోనివ్వదు.ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు.

Foods To Be Taken To Cut Loose Motion Down-Telugu Health-Telugu Tollywood Photo Image

మేం చెప్పే చిట్కాలు పాటిస్తే సరిపోతుంది

* లూజ్ మోషన్స్ కి అతి సులువుగా, అతి చవకగా దొరికే మందు అరటిపండు.దీనిలో ఉండే పెక్టిన్ అనే పదార్థం, రిచ్ పొటాషియం కంటెంట్, మోషన్స్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

లూజ్ మోషన్స్ తో ఇబ్బందిపడుతున్నప్పుడు రెండు మూడు గంటలకోసారి ఒక్క అరటిపండైనా తింటూ ఉండండి

* యోగ్ రట్ కూడా లూజ్ మోషన్స్ పై బాగా పనిచేస్తుంది.దీనిలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా జీర్ణక్రియను ట్రాక్ లో పెట్టి మోషన్స్ ని ఆపేస్తుంది.

అందుకే మోషన్స్ వచ్చిన రోజు 2-3 కప్పుల యోగ్ రట్ తినండి

* ఆపిల్ సైడెడ్ వెనిగర్ లాభాల గురించి కొత్తగా చెప్పేదేముంది.ఇది మోషన్స్ ని కలిగించే బ్యాక్టీరియాని చంపుతుంది.

అరటిపండు లాగే దీంట్లో కూడా పెక్టిన్ కంటెంట్ ఎక్కువ.గ్లాసులో గోరువెచ్చని నీళ్ళు తీసుకోని ఓ రెండు టీస్పూనుల ఆపిల్ వెనిగర్ ని కలిపి తాగుతూ ఉండండి.

ఫలితం మీ కళ్ళ ముందు ఉంటుంది

* అల్లం కూడా మోషన్స్ పై బాగా పనిచేస్తుంది.వేడి నీటిని గ్లాసులో తీసుకోని అందులో చెంచాడు అల్లం వేసుకోని రోజుకి ఓ మూడుసార్లు తాగండి.

మోషన్స్ దెబ్బకి పారిపోవాల్సిందే

* పసుపుతో కాని పని ఉంటుందా! చెంచాడుకి కొంచెం తక్కువ పసుపుని గోరువెచ్చని నీటిలో కలుపుకోని రోజుకి మూడుసార్లు తాగండి.లూజ్ మోషన్స్ నుంచి ఉపశమనాన్ని పొందడం ఖాయం.
* దానిమ్మపండులో యాంటిఫంగల్, యాంటివైరల్, యాంటిబ్యాక్టిరియల్ లక్షణాలు బాగా ఉంటాయి.మోషన్స్ వచ్చినప్పుడు, రోజుకి రెండుమూడు గ్లాసుల దానిమ్మరసం తప్పకుండా తాగండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Foods To Be Taken To Cut Loose Motion Down Related Telugu News,Photos/Pics,Images..

footer-test