వీర్యం పల్చగా వస్తే ఏం చేయాలి?  

Foods To Be Taken For Healthy Sperm -

మగవారిలో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా ముఖ్యం.వీర్యం ఎంత బలంగా ఉంటే, తండ్రి అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

ఆహారపు అలవాట్ల వల్ల, వంశపారంపర్యంగా, రాను రాను మగవారి వీర్యం పల్చగా మారుతోంది.మరి వీర్యం బలాన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఆహారంలోకి ఏం తీసుకోవాలి?

TeluguStop.com - Foods To Be Taken For Healthy Sperm-Telugu Health-Telugu Tollywood Photo Image

* శరీరంలో విటమిన్ లోపం ఉంటే కూడా వీర్యం పల్చగా వస్తుంది.కాబట్టి విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి12 ఉండే అహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

* ఆపిల్, జామ, మామిడి, బెర్రిస్, పైనాపిల్, వాటర్ మిలన్ లాంటి ఫలాల్లో ఫ్రక్టోజ్ ఎక్కువగా లభిస్తుంది.

ఇది వీర్యానికి మంచిది.అలాగే టమాటో, క్యాబేజి, ఉల్లిపాయ లాంటి కూరగాయల్లో కూడా ఫ్రక్టోజ్ లభిస్తుంది.

* ఎండుఖర్జురాలు రెండు మూడు గంటలు పాలల్లో నానబెట్టి, ఆ తరువాత తాగాలి.దీనివల్ల శరీరానికి డైటర్ ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్‌లు దొరుకుతాయి.

అలాగే విటమిన్ బి 1, బి 2, బి 5 కూడా మంచి మోతాదులో లభిస్తాయి.ఇలా రోజూ చేస్తే, మీ వీర్యం ఎంతగానో బలపడుతుంది.

* నిద్రలేమి సమస్యల వల్ల కూడా వీర్యం బలహీనపడుతుంది.కాబట్టి రోజుకి 7-8 గంటల నిద్ర తప్పనిసరి.

* ఒత్తిడి, స్ట్రెస్ వీర్యాన్ని బలహీనపరుస్తాయి.కాబట్టి, ఒత్తిడికి దూరంగా వెళ్లి, ఉల్లాసంగా ఉండటం, నవ్వడం నేర్చుకోవాలి.

* వ్యాయామం, యోగా ఒత్తడిని తగ్గించడంతో పాటు, కండరాలకి బలాన్నందిస్తాయి.ఆ రకంగా వీర్యం కూడా బలపడుతుంది.

* సాయంత్రం స్నాక్స్ లోకి పీనట్స్, బాదం, జీడిపప్పు లాంటివి తీసుకోవాలి.నట్స్ వీర్యానికి మంచి స్నేహితులు.

ఎందుకంటే వీటిలో జింక్ బాగా లభిస్తుంది.ల్యాంబ్ మటన్ కూడా తింటూ ఉండాలి.

* ఇవి మాత్రమే కాకుండా, చికెన్, గుడ్లు, మటన్, బ్రౌన్ రైస్, ఓట్స్, చేపలు కూడా వీర్య ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Foods To Be Taken For Healthy Sperm Related Telugu News,Photos/Pics,Images..