ఫ్రిడ్జ్ లో వీటిని మాత్రం స్టోర్ చేయొద్దు

ఓ పదిహేను వేలు పెట్టి ఫ్రిడ్జ్ కొనగానే ఏదిపడితే అది దాంట్లో స్టోర్ చేసేస్తుంటారు.కూరగాయలు, పండ్లు, జ్యూస్, చివరికి వండుకున్న ఆహారం కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తారు.

 Foods That You Shouldn’t Store In Refrigerator-TeluguStop.com

పాడవకుండా ఉంచడానికి ఇది మంచి మార్గమే అయినా, కొన్నిటిని మాత్రం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకపోతేనే మంచిది.ఆవేంటంటే …

* ఉల్లిగడ్డను ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు.

వాటికుండే వాసన ఫ్రిడ్జ్ మొత్తంతో పాటు అందులో ఉన్న ఆహారం కూడా వాసన వచ్చేలా చేస్తుంది.

* టమాటోలకు స్వచ్ఛమైన గాలి తగలాలి.

చల్లబడిన టమాటోలు రుచిని కోల్పోతాయి.కాబట్టీ టమాటో ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

* వాటర్ మిలన్ ను ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే తొనొచ్చు.అయితే సగం తిని, మరో సగం తరువాత తినాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టేయ్యండి.

* తేనెకు ఎలాంటి రిఫ్రిజిరేటర్ అవసరం లేదు.అది ఎండాకాలమైనా, వానాకాలమైనా లేదా చలికాలమైనా, తేనె ఊరికే బయట పెట్టేస్తే వచ్చే నష్టమేమీ లేదు.

* బ్రెడ్ ని ఏదైనా చల్లటి ప్రదేశంలో పెడితే సరిపోతుంది.రిఫ్రిజిరేటర్ లో పెడితే, దానిలోని స్వచ్ఛమైన గుణాలు మనకు అందకపోవచ్చు.

* వెల్లుల్లి ఎక్కువకాలం పనికిరావాలంటే దాన్ని గాలి ఆడే చోట పెడితే సరిపోతుంది.దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టాల్సిన అవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube