బలమైన దంతాల కోసం ఈ ఆహారాలు కావాలి

మంచి ఆహారం తినాలన్నా, ఆహారాన్ని బాగా తినాలన్న దంతాలు బలంగా ఉండటం అవసరం.అంతేకాదు, మన అందానికి కారణం చిరునవ్వు, ఆ చిరునవ్వు అందంగా ఉండాలన్న దంతాలు ఆరోగ్యంగా ఉండటం అవసరం.

 Foods That Keep Your Teeth Strong And Healthy-TeluguStop.com

మరి దంతాలకి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నారా ?

* దంతాలు కాని, ఎముకలు కాని, బలంగా ఉండాలంటే కాల్షియం దొరకడం ముఖ్యం.కాబట్టి కాల్షియం బాగా దొరికే ఆహారాన్ని ప్రేమించండి.

* దంతాలు అందంగా ఉండాలంటే నీళ్ళు బాగా తాగాలి.నీళ్ళు బాగా తాగడం వలన చిగుర్లు తేమగా ఉండి, పళ్ళు బలంగా ఉంటాయి.

* అరెంజ్ ని కలుపుకోని, సిట్రస్ జాతి ఫలాలు దంతానికి మంచివే.ఇవి బ్యాక్టిరియా తొలగించడానికి సహాయపడతాయి.

కాని, సిట్రస్ ఫలాలు తిన్న తరువాత నోటిని శుభ్రపరుచుకోవడం మరచిపోవద్దు.

* పాలలో కాల్షియంతోపాటు విటమిన్ డి బాగా లభిస్తుంది.

కాబట్టి పాలు తాగడం దినచర్యలో ఓ భాగంగా భావించండి.

* ఆపిల్ తినటం వలన నోటిలో లాలాజలం శాతం పెరుగుతుంది.

దాంతో దంతాలకు రంధ్రాలు పడే ప్రమాదం తగ్గుతుంది.

* టీ, కాఫీకి బదులు గ్రీన్ టీ తాగితే దంతాలకి మేలు చేసినవారవుతారు.

దీనిలో లభించే పాలిఫెనోల్స్ బ్యాక్టిరియాని తొలగించడమే కాదు, టీ, కాఫీ మోసుకొచ్చే ప్రమాదాలు తీసుకురాదు.

* నట్స్, డార్క్ చాకోలేట్, చీజ్ కూడా దంతాల ఆరోగ్యానికి మంచివి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube