బరువు పెరగటానికి ఉపయోగపడే ఆహారం ఇది     2016-08-30   23:16:32  IST  Lakshmi P

బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో, ఎలాంటి ఆహారం తినాలో, ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పటికీ చాలాసార్లు తెలుసుకున్నాం. కాని అందరికి బరువు తగ్గాలనే ఉండదు కదా. కొందరికి బరువు పెరగాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. అలాంటివారు ఏం తినాలంటే …

* పొద్దున్నే గుడ్లతో డైట్ ని ప్రారంభిస్తే మంచిది. గుడ్లలో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ప్రోటీన్లు మరియు కాలరీలు లభిస్తాయి. గుడ్లు తినడం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది.

* పాస్తాలో కాలరీలు విపరీతంగా దొరుకుతాయి. సులువుగా బరువు పెరగాలంటే పాస్త తినటం మర్చిపోవద్దు. రుచికి రుచి, బరువుకి బరువు దొరుకుతాయి.

* వాల్ నట్స్ లో ఫైబర్, ప్రొటీన్ తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ దొరుకుతాయి. అంతే కాదు, అనారోగ్యకరమైన కొలెస్టరాల్ ని ఒంట్లోంచి తీసివేసేందుకు కూడా వాల్ నట్స్ పనికొస్తాయి.

* పీనట్స్ తో కూడా ఈజీగా బరువు పెరగొచ్చు. ఇందులో పొటాషియం, ప్రొటీన్, హెల్తి ఫ్యాట్స్ బాగా లభిస్తాయి. మీ డైట్ లో పీనట్స్ ఉంటే తక్కువ సమయంలో బరువు పెరిగిపోతారు.

* చీజ్ లో కూడా కాలరీలు దండీగా దొరుకుతాయి. కొంచెం తిన్నా మంచి మోతాదులో కాలరీలు శరీరంలోకి చేరిపోతాయి. పైగా ఇందులో విటమిన్ బి12, కాల్షియం అదనంగా లభిస్తాయి.

* యోగ్ రట్ కూడా బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో న్యూట్రింట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.

* డార్క్ చాకోలేట్స్ లో కూడా వందలకొద్దీ కాలరీలు దొరుకుతాయి. డార్క్ చాకొలెట్లు బరువు పెరగడానికే కాకుండా ఇంకెన్నో రకాలుగా పనికివస్తాయి. కాబట్టి వీటి మీద కూడా ఓ గాటు వేస్తూ ఉండండి.