వక్షోజాలు ఆ ప్రమాదంలో పడితే ఇవి తప్పనిసరి     2018-04-05   01:05:21  IST  Lakshmi P

ప్రమాదకరమైన క్యాన్సర్స్ లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఈ మహమ్మారి ప్రతీ ఏడాది మిలియన్ల కొద్ది మహిళల్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. ప్రాణాలు కూడా తీస్తోంది. అయితే రొమ్ములను ఆక్రమించగానే అంత అయిపోయింది అనే నిస్సహాయతే వద్దు. దానితో పోరాడాలంటే ఆదిలోనే డాక్టర్ దగ్గర. చికిత్స మొదలుపెట్టాలి. అలాగే మన ప్రయత్నాల్లో భాగంగా ఈ క్రింది ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

* ఉదయాన్నే మిల్క్ టీ, కాఫీకి బదులు రొమ్ము క్యాన్సర్ తో బాధపడేవారు గ్రీన్ టీ తాగడం ఉచితం. ఎందుకంటే దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ఫ్లేవోనైడ్స్ ఉంటాయి. అలాగే యాంటి ఇంఫ్లేమెంటరీ ప్రాపర్టీస్ క్యాన్సర్ తో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుంటుంది గ్రీన్ టీ.

* ఫాట్టి ఫిష్ లో విటమిన్ డి పాళ్ళు ఎక్కువ. విటమిన్ డీ క్యాన్సర్‌ పై బాగా పనిచేసే విటమిన్ అని కొత్తగా చెప్పనక్కరలేదు అనుకుంటా.

* బీన్స్ క్యాన్సర్ సెల్స్ ఏర్పడకుండా అడ్డుకోగలదు. అప్పటికే క్యాన్సర్ వచ్చుంటే ఆ సెల్స్ మరింత పెరగకుండా ఆపగలవు. ఇవి ఇమ్యూనిటి సిస్టమ్ ని కూడా బలపరుస్తాయి.

* డార్క్ గ్రీన్ విజిటబుల్స్ క్యాన్సర్‌ ని అడ్డుకుంటుందని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా పాలకూర బాగా ఉపయోగపడుతుంది.

* ఆల్మండ్స్ లో ఉండే ఒమేగా -9 క్యాన్సర్ సెల్స్ ని సులువుగా చంపేస్తుంది. ఇవే ప్రాపర్టీస్ అవకాడో లో కూడా దొరుకుతాయి.