తలనొప్పి మీద పోరాటం చేసే సూపర్ ఆహారాలు  

బాధాకరమైన తలనొప్పిని తగ్గించుకోవటానికి మన రోజువారీ ఆహారంలో కొన్ని సూపర్ ఆహారాలను జోడించాలి. తలనొప్పి రావటానికి కారణాలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉంటాయి. సాదారణంగా తలనొప్పికి ఒత్తిడి, అలసట, మందుల యొక్క ప్రభావాలు, నిద్ర లేమి, వైరల్ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, చాలా చల్లని ఆహారం లేదా పానీయం వేగంగా త్రాగటం,దంత మరియు సైనస్ సమస్యలు కారణం అవుతాయి. అయితే తలనొప్పిని తగ్గించుకోవటానికి మరియు ఉపశమనం కొరకు కొన్ని సమర్ధవంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1. సజ్జలు

సజ్జలలో మెగ్నీషియం మరియు రిబోఫ్లావిన్ సమృద్దిగా ఉండుట వలన తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే రక్త నాళ గోడలు స్థిరీకరించేందుకు మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరిచేందుకు అద్భుతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మెగ్నీషియం మైగ్రెయిన్ తలనొప్పిని నయం చేయడంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరోవైపు రిబోఫ్లావిన్ తలనొప్పి ఉపశమనంలో సహాయపడుతుంది.

2. నువ్వులు

నువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి క్రంచి మరియు వగరు రుచిని కలిగి ఉంటాయి. సాదారణంగా నువ్వులను మైగ్రెయిన్ తలనొప్పి చికిత్సకు సిఫార్స్ చేస్తున్నారు. నువ్వులలో ఉండే పోషకాలు రక్త నాళాల సంకోచ ప్రమాదాన్ని తగ్గించటం ద్వారా మైగ్రెయిన్ తలనొప్పిని తగ్గిస్తాయి.

3. అల్లం

అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు నొప్పి ఉపశమనం లక్షణాలు ఉంటాయి. దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, పురాతన కాలం నుండే అనేక రకాల రుగ్మతలకు ఔషదంగా వాడుతున్నారు. ఈ సూపర్ ఫుడ్ నొప్పి మరియు మైగ్రైన్ తలనొప్పిని సహజంగా తగ్గించటానికి సహాయపడుతుంది.

4. బాదం

బాదంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండుట వలన తలనొప్పి చికిత్సలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. బాదంలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్త నాళాలు మరియు కండరాలకు విశ్రాంతి ఇవ్వటం ద్వారా ఒత్తిడి తగ్గించి తలనొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది. బాదంలో ఉండే ట్రిప్టోఫాన్ అనేడి మెదడులో సెరోటోనిన్ అనే రసాయనం విడుదలలో సహాయపడుతుంది. ఈ రసాయనం తలనొప్పి తగ్గిన అనుభూతిని కలిగిస్తుంది.

5. అరటి పండు

అరటిపండులో మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్త నాళాల సంకోచం కారణంగా కలిగే తలనొప్పిని తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే మెగ్నీషియం హ్యాంగోవర్ కారణంగా వచ్చిన తలనొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.