ఎసిలేప్సి ( మూర్ఛ రోగం) ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం  

Foods That Help Epilepsy -

మూర్ఛ రోగం ఉన్నవారు ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

పండ్లలో ఆపిల్,ద్రాక్ష,అత్తిపండు మంచి ఫలితాన్ని ఇస్తాయి.ఈ మూడు రసాల మిశ్రమం గాని, ఒక పండు రసం గాని తీసుకోవచ్చు.వరుసగా మూడు నెలల పాటు రోజుకి 500 ml జ్యుస్ ని తీసుకోవాలి.వీటిల్లో ద్రాక్షను ఎక్కువగా తీసుకుంటే మంచిది.

Foods That Help Epilepsy -Foods That Help Epilepsy - -Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

కూరగాయల్లో బీట్ రూట్,కీరదోస,క్యారెట్ లు మంచివి.ఈ మూడు జ్యుసుల మిశ్రమాన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు 300 ml క్యారట్ జ్యుస్, మిగిలిన రెండు ఒకొక్కటి 100 ml మోతాదులో తీసుకుంటే మంచిది.

విటమిన్ బి6 సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలి.అన్నం,పాలు,పులిసిన పదార్దాలు(పెరుగు,దోసె ల వంటివి), ఆకుపచ్చని కూరగాయలు,వేరుశనగపప్పు వంటివి ప్రతి రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఈ జాగ్రత్తలు మరియు మంచి ఆహారం తీసుకోవటం వలన నెర్వస్ సిస్టం పనితీరు మెరుగు అవుతుంది.దాంతో మూర్ఛ రోగం కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు