ప్లేటేట్లు తక్కువై డెంగ్యూతో బాధపడితే ఈ ఆహారం పనికివస్తుంది

డెంగ్యూ వ్యాధిలో కనిపించే చాలా ప్రమాదకమైన దుస్థితి బ్లడ్ ప్లేట్లేట్లు (రక్త ఫలకికలు) తగ్గడం.ఈ బ్లడ్ ప్లేట్లేట్ల సంఖ్య ప్రతి మైక్రోలీటర్ రక్రంలో 1,50,000 కన్నా తక్కువగా ఉంటే అది ప్రమాద ఘంటికే.

 Foods That Can Increase Blood Platelets Count-TeluguStop.com

అలాంటప్పుడు ప్లేట్లేట్ల సంఖ్య పెంచడానికి అవసరమైన ఆహారం తీసుకోవడం అవసరం.అవేంటంటే .

* ఆశ్చర్యంగా అనిపించినా, వీట్ గ్రాస్ (గోధుమగడ్డి) ప్లేట్లేట్ల సంఖ్యను బాగా పెంచుతుంది.అరగ్లాసు గోధుమగడ్డి జ్యూస్ లో నిమ్మరసం కలుపుకోని తాగుతూ ఉండాలి.

* పాపాయా ఆకులతో జ్యూస్ తయారుచేసుకోని తాగితే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.ఈ జ్యూస్ కుడా ప్లేటేట్ల సంఖ్యను పెంచుతుంది.

* పాలకూరలో విటమిన్ k ఎక్కువగానే ఉంటుంది.పాలకూరని ఉడకబెట్టి, ఆ తరువాత జ్యూస్ చేసుకోని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

* తిప్పతీగ కూడా ప్లేటేట్లు సంఖ్యను పెంచుతుంది.దీన్ని కూడా జ్యూస్ లాగా చేసుకోని ప్రతీ గంటకు 2,3 స్పూన్లు తాగాలి.

* పొద్దున్నే ఏమి తినకముందు రెండు మూడు ఉసిరికాయలు తినడం కూడా ఉపయోగపడుతుంది.ఇది ప్లేటేట్ల సంఖ్యను పెంచడమే కాదు, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

* కలబందను మించిన ఔషధం ఉంటుందా ! ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది.ఇంఫెక్షన్స్ ని తీసేసి ప్లేటేట్ల సంఖ్య పెరిగేందుకు సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube