మొటిమలకు కారణం అయ్యే ఆహారాలు

ఈ రోజుల్లో అడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యమొటిమలు.ఈ సమస్య జీవితంలో ఎదో ఒక సమయంలో ప్రతి ఒక్కరిని భాదిస్తుంది.

 Foods That Can Cause Acne-TeluguStop.com

సాధారణంగా మొటిమలు అనేవి ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, మీరు తీసుకొనే ఆహార పదార్థాల వల్ల కూడా సంభవించవచ్చు.ఇప్పుడు ఆ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం.

బ్రెడ్


 Foods That Can Cause Acne-మొటిమలకు కారణం అయ్యే ఆహారాలు-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్రెడ్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలను తగ్గిస్తుంది.దాంతో మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బ్రెడ్ లో గ్లూటెన్ను ఉండటం వలన మొటిమలను కలిగిస్తుంది.అందువల్ల మీ డైట్ నుంచి బ్రెడ్ ని తొలగించండి.

చాక్లెట్


చాక్లెట్ అంటే దాదాపుగా అందరికి ఇష్టమే.చాక్లెట్ మానాలంటే కష్టమే.అయినా మొటిమలు తగ్గాలంటే చాక్లెట్ తినటం మానాలి.చాక్లెట్ లో ఉండే కొవ్వు,చక్కెరలు మీ శరీరంపై మంటను కలిగించే సెబమ్ తైలాన్ని అధికంగా ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహిస్తాయి.దాంతో అది మొటిమలకు కారణం అవుతుంది.

జున్ను


జున్నులో ప్రొజెస్టెరాన్ సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు ఉత్పత్తి గ్రంధులను అధిక మొత్తంలో పెంచుతుంది.దీనితో చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి మీ ఆహారం నుండి జున్నును తొలగించండి.

బంగాళ దుంప చిప్స్


బంగాళ దుంప చిప్స్, ఫ్రాంచ్ ఫ్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం పూర్తిగా మానేయాలి.ఇవి చర్మంపై వాపును కలిగించటానికి కారణం అవుతాయి.అది మొటిమలకు కారణం అవుతుంది.కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆహారాలను మానేయటమే ఉత్తమం.

.

#Chocolate #FoodsThat #Potato Chips #Harmones #Acne

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు