పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం ఇది

పిల్లలు ఉన్నచోట ఉండటం కష్టం.మట్టి, ధూళిలో ఆడేస్తారు.

 Foods That Boost Up Immunity Levels In Children-TeluguStop.com

ఆరోగ్య జాగ్రత్తలు వాళ్ళకి అసలు తెలీవు.దీంతో రకరకాల ఇంఫెక్షన్లు వారిపై దాడి చేయొచ్చు.

ఆ దాడిపై ఎదురుదాడి చేయాలంటే వారికి రోగనిరోధకశక్తి అవసరం.పిల్లల్లో రోగనిరోధకశక్తి చిన్నప్పటి నుంచే పెంచాలంటే ఈ ఆహారం ఇవ్వండి.

* కూరగాయల్లో కెరీటనాయిడ్స్ తో పాటు యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి ఇమ్యునిటిని పెంచుతాయి.కూరగాయల భోజనం చిన్నప్పుడే అలవాటు చేయండి.

* పెరుగు కూడా రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

ఎందుకంటే దీనిలో ప్రొబయోటిక్స్ ఉంటాయి.పెరుగు చల్లగా, రుచిగా ఉంటుంది కాబట్టి, పిల్లలు కాదనకుండా తింటారు.

* ఫైబర్ మరియు ఫెటోకెమికల్స్ వంటి పోషకాలు రోగనిరోధకశక్తికి మంచివి.ఇవి కాలిఫ్లవర్ లో బాగా లభిస్తాయి.పిల్లల డైట్ లో దీన్ని చేర్చండి.

* బీన్స్, కాయధాన్యలు రెగ్యులర్ గా ఇస్తే, బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటాడో మీరే చూస్తారు.

* రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినపించడం ద్వారా కూడా పిల్లల ఇమ్యునిటి సిస్టమ్ ని బలంగా తయారుచేయవచ్చు.దీంట్లో ప్రొటీన్స్ ఉండటం అదనపు లాభం.

* వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచడానుకి వెల్లులి మంచి మార్గం.ఇది రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది.

* బెర్ర్రి ఫలాలు ఏవైనా సరే, పిల్లల ఇమ్యినిటి సిస్టమ్ కి మంచివే.

* వాల్ నట్స్ కూడా రోగనిరోధకశక్తిను బాగా పెంచేస్తాయి.

ఎందుకంటే వీటిలో ఒమేగా త్రి ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube