విటమిన్ డి అందించే సూప‌ర్ ఫుడ్ ఇదే!!

Foods Provides Vitamin D

మానవ శ‌రీరానికి `విటమిన్ డి` ఎంతో అవ‌స‌ర‌మ‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.విటమిన్ డి ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది.

 Foods Provides Vitamin D-TeluguStop.com

రోగ నిరోధక శక్తి బ‌ల‌ప‌డ‌టానికి ఉప‌యోగ‌‌ప‌డుతుంది.రక్తం లో ఉన్న నాళాలను ర‌క్షిస్తుంది.

డయాబెటిస్ స‌మ‌స్య రాకుండా అడ్డుకుంటుంది.చర్మం కాంతివంతగా మారుస్తుంది.

 Foods Provides Vitamin D-విటమిన్ డి అందించే సూప‌ర్ ఫుడ్ ఇదే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చెప్పుకుంటే విట‌మిన్ డి వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

అయితే ఇటీవ‌ల కాలంలో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు.

విటమిన్డి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, జుట్టు రాలిపోవడం, మెదడు, ఊపిరితిత్తులు, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే ఖ‌చ్చితంగా శ‌రీరంలో విట‌మిన్ డి పెంచుకోవాల్సి ఉంటుంది.

సాధార‌ణంగా విట‌‌మిన్ డి సూర్య‌ర‌శ్మి ద్వారా ల‌భిస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌తోనూ విట‌మిన్ డి పెంపొందించుకోవ‌చ్చు.పాలు, పాల‌తో చేసే ప‌దార్థాల్లో విట‌మిన్ డి పుష్క‌లంగా ఉంటుంది.అందుకే ప్ర‌తిరోజు పాలు, పెరుగు, ఛీజ్ వంటివి ఖ‌చ్చితంగా డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

అలాగే కోడిగుడ్ల‌లో విట‌మిన్ డి అధికంగా ఉంటుంది.ముఖ్యంగా అందులోని ప‌చ్చ‌సొన‌లో విటమిన్ డి ఉంటుంద‌ని అంటున్నారు నిపుణులు.

క‌నుక నిత్యం కోడిగుడ్ల‌ను తినాలి.చేప‌ల్లో విటమిన్ డి ఎక్కువ‌గా ల‌భిస్తుంది.

అందులో ముఖ్యంగా సాల్మ‌న్‌, ట్యూనా అనే చేప‌ల్లో ఇది మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది.వీటితో పాటు కమలాపళ్ళు, రొయ్యలు, ఓట్స్‌, సీజ‌న‌ల్ ఫ్రూట్స్ ద్వారా విట‌మిన్ డి ల‌భిస్తుంది.

#Healthy #Vitamin #Tips #Vitamin

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube