రోగనిరోధక శక్తి పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆహారం తీసుకోండి!

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఏ మోతాదులో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీనితో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి స్వీయ జాగ్రత్తలతో పాటు రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఇప్పుడు చాల అవసరం మనకు.

 Eat This Food For Increase Immune System , Immune System , Vitamins, Proteins,-TeluguStop.com

కాబట్టే సరైన ఆహారం తినండి కోవిడ్ ఎదుర్కోండి అనే నినాదంతో భారత ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాలు పరిరక్షణ సంస్థ మంగళవారం వాటి అడుగు దిశగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

అందులో ప్రతిరోజు విటమిన్లు, ఖనిజ, లవణాలను, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్… లాంటి వాటిని తీసుకుంటే కరోనా వైరస్ ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మన శరీరంలో అభివృద్ధి చెందుతుందని తెలియజేయడం జరిగింది.

నిజానికి అలాంటివి ఏ ఆహార పదార్థాలలో ఉంటాయో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి…? మొదలగు వాటి గురించి ఒకసారి చూద్దామా….

ముఖ్యంగా మన శరీరంలో ఎప్పటికప్పుడు తగినంత నీరు మన శరీరంలో ఉండడం ద్వారా విష పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపించడం చాలా సులువవుతుంది.

దీనికోసం మినరల్ వాటర్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, హెర్బల్ టీ, సూపులు… మొదలగు ఉప్పు లేని ద్రావణాలు, పండ్లు, కూరగాయలు తీసుకుంటే వాటి నుంచి బయట పడవచ్చు.అంతేకాకుండా ఉప్పు కలపని గింజలు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, సోయా ఉత్పత్తులు, చికెన్, చేప, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ప్రొటీన్లను పొందవచ్చు.

ఇక అదే విధంగా గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వాల్ నట్స్, చేపలు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాట్ యాడ్స్ మనకు లభిస్తాయి.అంతే కాకుండా క్యారెట్, మామిడి, చిలగడదుంప, పాలకూర, బచ్చలి కూర తీసుకోవడంతో విటమిన్ A కూడా మనకు దొరుకుతుంది.

అంతేకాకుండా విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి 6 , విటమిన్ బి విటమిన్ సి మొదలగు ఖనిజలవణాలు తీసుకోవడం ద్వారా మన శరీరంలో శారీరక నిరోధక శక్తి పెంచుకోవచ్చును.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube