బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచే సూప‌ర్ ఫుడ్స్ ఇవే!

బిడ్డ శారీరక మానసిక ఎదుగుదలకి తోడ్ప‌డే అన్ని పోష‌కాలు త‌ల్లి పాల‌లోనే ల‌భిస్తాయి.అందుకే త‌ల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి అని అంటుంటారు.

 These Foods Helps To Increase Breast Milk! , Good Food, Breast Milk, Latest News-TeluguStop.com

శిశు జననం నుంచి కనీసం ఆరు నెలల పాటు త‌ల్లి పాలు ప‌డితే.తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

అయితే కొంత మందిలో స‌హ‌జంగానే ప్ర‌సవం త‌ర్వాత పాలు స‌రిగ్గా ప‌డ‌వు.అలాంటి వారు త‌మ డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను చేర్చుకుంటే.

పాల ఉత్ప‌త్తి అద్భుతంగా పెరుగుతుంది.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

బాలింత‌ల్లో పాలు ప‌డేలా చేయ‌డంలో మున‌గ ఆకు సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అందు వ‌ల్ల‌, మున‌గాకుతో త‌యారు చేసిన వంట‌ల‌ను తీసుకుంటే.

మీ బిడ్డ‌కు స‌రిప‌డా పాలు ప‌డ‌తాయి.మున‌గాకే కాకుండా.

తోట‌కూర‌, పాల కూర, మెంతి కూర వంటివి కూడా పాల ఉత్ప‌త్తిని పెంచుతాయి.

బిడ్డ‌కు పాలిచ్చే త‌ల్లులు ఓట్స్ తీసుకోవ‌డం చాలా ఉత్త‌మం.ఎందుకంటే, ఓట్స్‌లో ఉండే పోష‌కాల విలువ‌లు.పాలు బాగా ప‌డేలా చేయ‌డంతో పాటు బాలింత‌ల‌కు బోలెడంత శ‌క్తిని అందిస్తాయి.

మ‌రియు ర‌క్త హీన‌త బారిన ప‌డ‌కుండా కూడా ర‌క్షిస్తాయి.

పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో ప‌చ్చి బొప్పాయి కూడా స‌మాయ‌ ప‌డుతుంది.ప‌చ్చి బొప్పాయితో కూర వండి.బాలింత‌ల‌కు పెడితే బిడ్డ‌కు స‌రిప‌డా పాలు ప‌డ‌తాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు కూడా పాల ఉత్పత్తికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల‌.గుడ్డు, పాలు, పెరుగు, ఆప్రికాట్స్‌, చేపలు, నువ్వులు, బాదం ప‌ప్పు వంటివి బాలింత‌లు తీసుకుంటే మంచిది.

అలాగే బాలింత‌లు వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తీసుకోవాలి.

బ్రౌన్ రైస్ పాలు ప‌డేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే బ్రౌన్ రైస్ తీసుకోవ‌డం త‌ల్లుల‌కు బోలెడంత ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

మ‌రియు బ‌రువు కూడా త‌గ్గుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube