తిండిని నియంత్రించే ఉత్తమ ఆహారాలు   Foods Control Cravings     2018-07-31   11:03:14  IST  Laxmi P

కొంతమందికి ఏదోకటి తినాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. దాంతో జంక్ ఫుడ్స్ ఎక్కువగా లాగించేస్తూ ఉంటారు. ఆలా తినటం వలన లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా భోజనం చేసిన రెండు గంటలకు ఆకలి వేస్తుంది. కానీ అస్తమాను ఎదో ఒకటి తినాలనే కోరిక ఉన్నవారు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఎదో తినాలనే కోరిక తగ్గుతుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

నట్స్

నట్స్ లో ఫైబర్ అధికంగా ఉండుట వలన ఆకలిని నియంత్రిచే హార్మోన్స్ మీద పనిచేసి ఆకలిని నియంత్రిస్తాయి.

రొయ్యలు

రొయ్యలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలన్నా, ఆకలి నియంత్రణలో ఉంచటానికి బాగా సహాయపడతాయి.

అరటిపండు

రెండు అరటిపండ్లు తింటే చాలు ఆకలి ఎగిరిపోయి తక్షణమే ఎనర్జీ వస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే రెండు కంటే ఎక్కువ అరటిపండ్లను తింటే మాత్రం శరీరంలో కొవ్వు చేరటం ఖాయం.

Foods Control Cravings-

వెజిటేబుల్స్

ఆకుకూరలు, క్యారెట్స్ , క్యాబేజి , బ్రక్కోలి వంటివి తినవచ్చు. కడుపు నింపటమే కాక, ఇవి ఆకలి నియంత్రిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకున్న ఏమి కాదు.

ఆపిల్

ఆపిల్ తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. అంతేకాక బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. చూసారుగా ఈ ఆహారాలను తీసుకోని ఆకలిని నియంత్రించుకోండి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.