నిమిషాల్లో ఫుడ్ ఇంటికి డ్రోన్ల సాయం తో డెలివరీ

ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్స్ చాలా నే వచ్చేశాయి.ఎక్కడపడితే అక్కడ ఏది కావలి అంటే ఆ ఫుడ్ ఆర్డర్ ఇవ్వగానే క్షణాల్లో ఇంటి ముందుకు వచ్చేస్తుంది.

 Food Supply By Using The Drons1-TeluguStop.com

దీనిలో వింత ఏముంది అనుకుంటే సరే.అయితే వినూత్నంగా ఫుడ్ ను డెలివరీ చేయాలని జొమాటో ప్రయత్నిస్తుంది.అదే డ్రోన్ల సాయం తో ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ప్రయత్నాలు చేస్తుంది.దీనికోసం ఇప్పటికే ఆ కంపెనీ ట్రయల్స్ కూడా పూర్తి చేసినట్లు ఆ కంపెనీ స్వయంగా బుధవారం వెల్లడించింది.

జోమాటో గత ఏడాది డిసెంబరులో గుర్‌గావ్‌కు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.అయితే డ్రోన్ల ద్వారా ఫుడ్‌ డెలివరీ చెయ్యాలి అన్న ఉద్దేశ్యం టోన్ జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక జొమాటో ఫుడ్ డెలివరీ డ్రోన్ ల సాయం తో చేయనుంది అన్నమాట.ఇక ఆ డ్రోన్స్ 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవట.

అంటే డ్రోన్‌ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని,దాదాపు5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదన్నట్లు సమాచారం.దీనితో ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ లో జొమాటో మంచి పోటీ ఇవ్వనుంది అన్నమాట.

మరి ఈ డ్రోన్ పద్దతి మిగిలిన ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా పాటిస్తాయేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube