ఫుడ్ పాయిజనింగ్..నివారణ చిట్కాలు  

Food Poisoning Contorl Tips-

నోటికి స్టాప్ లేకుండా.నాన్ స్టాప్ గా తినేస్తుంటారు కొంతమంది..

ఫుడ్ పాయిజనింగ్..నివారణ చిట్కాలు -

ఎక్కడ పడితే అక్కడ.తినేయడం అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న తిండిని తినడం అంత మంచిది కాదు.కొంతమంది నిల్వ ఉన్న ఆహారాన్ని అమ్మేస్తుంటారు.

అలాంటి ఆహారాన్ని తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చాలా మందికి ఇటువంటి సమస్య ఎదుతవుతుంది.

అలాంటప్పుడు వాంతులు.వికారం.కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తు ఉంటాయి.

ఇలా జరిగినపుడు మనామా కొన్ని కొన్ని చిట్కాలి పాటిస్తే సరిపోతుంది.ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ముందు కడుపులో వికారం మొదలవుతుంది.

దానిని అశ్రద్ద చేస్తే వాంతులు అవుతాయి.వికారం మొదలవ్వగానే.

ఒక స్పూన్ తేనే తీసుకుని మూడు పూటలా త్రాగితే వికారాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే కొత్తిమీర కొంచం తీసుకుని దానిని నలిపి వాసన చూసినా.

లేక ఒక ఆకు నోటిలో వేసుకున్నా సరే వికారం తగ్గుతుంది.పెరుగులో కూడా ఫుడ్ పాయిజనింగ్ తగ్గించే కారకాలు ఉన్నాయి.

అంతేకాదు కప్పు నీళ్ళలో ఒక స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి.ఈ నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసి మరిగించాలి.

వచ్చిన ద్రావణాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్య రాదు మరియు ఇతరాత్ర వచ్చే ఇబ్బందులు కూడా పోతాయి. నీరసంగా ఉన్న సమయంలో ఒక అరటిపండు తింటె బాగుంటుంది.

ఈ చిట్కాలలో ఎదో ఒక దానిని సమస్య వచ్చినప్పుడు ఉపయోగించండి.ఇంకా అత్యవసరం అయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.