ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన 76 మంది

విశాఖ ఏజెన్సీలో పశుమాంసం తిని 76 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.విశాఖ ఏజెన్సీ లోని మాడుగుల మండలం లోని మగతపాలెం గ్రామం లో ఈ ఘటన చోటుచేసుకుంది.

 Diarrhea Outbreak In Visakhapatnam District, Diarrhea, Vizag, Meat, Village Peop-TeluguStop.com

ఇటీవల ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఆవు కొండ ప్రాంతంలో మృతి చెందింది.ఈ నేపథ్యంలో మంగళవారం ఆ ఆవును తీసుకువచ్చి దాని మాంసం ను గ్రామస్థులు అందరూ పంచుకున్నారు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గ్రామస్తులు మాంసాన్ని పంచుకోగా రాత్రి భోజనం చేశారు.

ఆ తరువాత నుంచి వారందరికి కూడా వాంతులు,విరోచనాలు అవ్వడం తో ఒక్కసారిగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 76 మందిలో ఆరుగురి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.దీనితో ఆ ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

మిగిలిన వారంతా కూడా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.అస్వస్తతకు గురైన వారిలో మహళలు,చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తుంది.

మంగళవారం పశు మాంసం ను పంచుకోగా కొందరు దానిని నిల్వ ఉంచుకొని మరి బుధవారం వండుకొని తిన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే వారంతా అస్వస్తతకు గురైనట్లు తెలుస్తుంది.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అస్వస్థతకు గురైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రజా ప్రతినిధులు కూడా వెళ్లి పరామర్శించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం 70 మంది పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube