ఇదెక్కడి చోద్యం: 3 నెలలుపాటు వండిన ఆహారాన్ని అక్కడ 8 నెలలు తిన్నారట!

అవును.వినడానికి చోద్యంలాగా కనబడుతున్నా మీరు విన్నది నిజమే.

 Food Cooked For 3 Months Was Eaten There For 8 Months , Food , Viral Latest ,-TeluguStop.com

అక్కడ ఓ 3 నెలలుపాటు వండిన ఆహారాన్ని అక్కడ 8 నెలలు తిన్నారు.ఆ కథేమిటో తెలుసుకోవాలంటే మీరు ఇది చదవాల్సిందే.

బేసిగ్గా ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంటి పనులలో ముఖ్యమైన వంట చేయడం అనే ప్రాసెస్ అతి పెద్ద పని అని చెప్పుకోవాలి.ఎందుకంటే దానికోసం రోజులు సుమారు రెండు నుండి మూడు గంటలపాటు సమయం కేటాయించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ముందుగానే వండేసి, నిల్వ చేసి పెట్టుకుంటే సరిపోతుందికదా అన్న ఆలోచన వచ్చింది.

ఈ ఆలోచన ఎవరికీ వచ్చిందో తెలుసా? ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల యువతి కెల్సీ షా అనే ఆమెకు ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది.ఇక ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాలోని ఇండియానాలో స్థిరపడింది.కుటుంబ సభ్యులకు వండి పెట్టడానికి ఆమెకు చాలా సమయం పట్టేది.దాంతో ఉద్యోగ బాధ్యతలకు అది ఆటంకంగా మారింది.దీంతో దీనికోసం ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులపై దృష్టి పెట్టారు.

ఇంటర్నెట్‌తోపాటు పుస్తకాల ద్వారా సమాచారం సేకరించారు.

Telugu Australia, Eaten, Cooked, Kelsey Shaw, Latest-Latest News - Telugu

ఇందుకోసం రోజుకు 2 గంటలు వారు కేటాయించారు.అలాగ ఓ 3 నెలల పాటు 426 మీల్స్‌ సిద్ధం చేసి, నిల్వచేశారు.కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఈ నిల్వ ఆహారమే వారికి దాదాపు 8 నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోయిందంటే మీరు ఆశ్చర్యపోతారు.

డీహైడ్రేషన్, వాటర్‌ క్యానింగ్‌ పద్ధతుల్లో ఆహారాన్ని చాలారోజులు నిల్వ చేయొచ్చని, తాజాగా ఉంటుందని కెల్సీ షా చెప్పారు.కాబట్టి ముప్పొద్దులా తినడమేకాకుండా ఇలాగ ఏదైనా పనికొచ్చే ఆలోచన చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube