ఈ ట్రిక్స్‌తో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయండిలా..!

నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.అయితే ప్రతీ కంప్యూటర్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌గా మారిపోయింది.

 Follow These Tricks To Get Free Access Of Ms Word Excel And Powerpoint Details,-TeluguStop.com

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేనిదే వర్క్ చేయడం కుదరదంటే అతిశయోక్తి కాదు.ఒక డాక్యుమెంట్ టైప్ చేయాలన్నా.

డేటాను చెక్ చేసుకోవాలన్నా.స్ప్రెడ్ షీట్ క్రియేట్ లేదా స్లైడ్స్ డిజైన్ చేసుకోవాలన్నా ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తప్పనిసరిగా కావాలి.

అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాని సేవలను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా కొంత మేర నగదు చెల్లించాల్సి ఉంటుంది.మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అఫిషియల్ కొనుగోలు చేశాక పూర్తిస్థాయిలో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ యూజ్ చేయవచ్చు.

దీని పైరసీ వెర్షన్ అమ్ముతుంటారు కానీ సేఫ్టీ కారణాల దృష్ట్యా దీన్ని ఉపయోగించకూడదని చెబుతుంటారు.ఒరిజినల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అఫిషియల్ ధర చాలా ఎక్కువగానే ఉంటుంది.

దాంతో స్టూడెంట్స్ వంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొనుగోలు చేసుకోలేని వారి కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ జెన్యూన్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది.

ఈ సాఫ్ట్‌వేర్‌ను పొందడానికి యూజర్లు స్టూడెంట్ లేదా టీచ‌ర్ లేదా ఫ్యాక‌ల్టీ మెంబ‌ర్‌గా మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu Access, Software, Latest, Microsoft, Excel, Word, Wordexcel, Teacher-Late

అంతేకాదు, ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన వెరిఫైడ్ ఈమెయిల్‌తో మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో సైన్-ఇన్ చేయాల్సి ఉంటుంది.అయితే స్టూడెంట్స్.మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ఈమెయిల్ అడ్ర‌స్‌తో సైన్-ఇన్ అయ్యి నమోదు చేసుకోవచ్చు.

తద్వారా స్టూడెంట్లు ఎంఎస్ ఆఫీస్ స్టూడెంట్ ప్యాకేజ్‌ను ఉచితంగా పొందొచ్చు.ఆఫీస్ 365 ద్వారా సైన్-ఇన్ అయ్యి.

ఎంఎస్ ఆఫీస్ సూట్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు.ఆ సూట్‌లో వ‌ర్డ్‌, ఎక్సెల్, ప‌వ‌ర్‌పాయింట్‌తో పాటు అవుట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, వ‌న్‌డ్రైవ్‌, షేర్‌పాయింట్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా వాడుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube