మీ స్మార్ట్ ఫోన్ ఏదైనా సరే.. ఇలా చేయండి క్వాలిటీ ఫొటోస్ పొందండి..!

చాలామంది ఫోన్ కొనాలంటే ముందుగా చూసేది కెమెరా.ఫోటోలు క్లారిటీగా వస్తున్నాయా లేదా అని చేసుకుంటాము కదా.అయితే ఇప్పుడు మార్కెట్లోకి 5 వేల నుండి 10 వేల రూపాయల ధరలో కూడా ఎక్కువ రిజల్యూషన్ గల కెమేరాలతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి.కానీ ఫోనులో ఎంత మంచి కెమేరా వున్నా కూడా కొన్ని సార్లు మనం తీసే ఫోటోలు బాగా రావు.

 Follow These To Get Quality Photos With Your Smart Phone-TeluguStop.com

ఫోటో క్లియర్ గా లేకపోవడం వలనో లేదా బ్యాగ్రౌండ్ డల్ గా ఉండడం వలనో ఫోటోలు సరిగా రావు.కానీ, ప్రీమియం ఫోన్ కెమెరా వంటి ఫోటోలను కూడా కొన్ని టిప్స్ పాటించడం వలన చాలా మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో కూడా ఫొటోస్ బాగా తీయవచ్చు.

మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా.!

 Follow These To Get Quality Photos With Your Smart Phone-మీ స్మార్ట్ ఫోన్ ఏదైనా సరే.. ఇలా చేయండి క్వాలిటీ ఫొటోస్ పొందండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటగా మీరు చేయాలిసిందల్లా ఒక్కటే.

మీ ఫోన్ లోని కెమెరా లెన్స్ ని శుభ్రంగా క్లీన్ చేయాలి.మనలో చాలా మంది ఫోన్ వాడిన ప్రతీసారి క్లీన్కెమెరా లెన్స్ ను క్లీన్ చెయ్యరు.

అయితే, మీరు ఫోటోలను తీయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ కెమేరా లెన్స్ ని క్లీన్ చేయ్యాలి.అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముందుగా మీరు తీయాలనుకుంటున్న ఫోటోలను నిర్ణయించుకుని వాటిపైనే పూర్తిగా ద్రుష్టి పెట్టాలి.

అంటే ముందుగా ఆ ఫోటోను ఎక్కడ.ఎలాంటి లొకేషన్ లో తీయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.

అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోటో సరిగ్గా రావాలంటే ముందుగా వెలుతురు అనేది చాలా ముఖ్యం.లైటింగ్ సరిగ్గా లేకపోతే ఫోటో కూడా కాంతివంతంగా ఉండదు.

పగటి సమయంలో మీకు తగినంత వెలుతురు ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మంచి ఫోటోలను తీయ్యొచ్చు.

ఒకవేళ పగటిపూట కూడా వెలుతురు సరిగా లేదని భావిస్తే మనం చీకటి సమయంలో తీసే ఫోటో కోసం ఫ్లాష్ ని వాడుతుంటాం కదా.అలానే పగలుకూడా ఫ్లాష్ వాడొచ్చు.ముఖ్యంగా, పోర్ట్రైట్ ఫోటోలను తీసేప్పుడు ఫ్లాష్ వాడడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

ప్రస్తుతం, దాదాపుగా అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లు కూడా వాటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (AI) ని ఉపయోగించి మంచి ఫోటోలకు ఎటువంటి ఎడిటింగ్ అవసరం లేకుండానే అందిస్తాయి.అంటే ఒక్కో ఫోన్ లో ఒక్క స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగించుకుని ఫోటోలు దిగండి.

పైన చెప్పిన టిప్స్ పాటించడం వలన మీ ఫోటోలు అందంగా కనిపిస్తాయి.!!

.

#Location #Smart Phone #Flash #TIps #Pixels

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు