చద్దన్నం తింటున్నారా..?! అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

చాలా మందికి చద్దన్నం తినడం అలవాటు.రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది ఉదయాన్నే లెమన్ రైస్ గానీ, పులిహోర గానీ, కర్డ్ రైస్ గానీ, సాల్ట్ రైస్ గానీ.

 Follow These Tips While You Are Eating Yesterdays Curd Rice, Card Rice, Eating,-TeluguStop.com

ఇలా ఎన్నో రకాలుగా చేసుకుని తింటారు.ఇంకొందరు తాళింపు వేసుకుని తింటారు.

ఇంకొందరు చద్దన్నాన్ని అంబలి చేసుకుని తీసుకుంటూ ఉంటారు.పాడైపోయిన అన్నం తినడం చాలా మందికి అలవాటే.

అయితే ఇటువంటి అన్నం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ పాడైపోయిన అన్నం తినడం ద్వారా అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి మిగిలిన అన్నం ఉదయాన్నే తినడం వలన అనేక అనారోగ్యాలు మీకు వచ్చే అవకాశం ఉంది.నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా అన్నం తినడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదని తేలింది.

అటువంటి నేపథ్యంలో రాత్రి అన్నం పగలు తినడం అనేది చేయకూడదు.ఒక్కోసారి రాత్రి మిగిలిన అన్నం ఉదయాన్నే తినడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

బియ్యం ఉడికించిన తర్వాత రూమ్ టెంపరేచర్ వద్ద ఎక్కువసేపు అన్నాన్ని ఉంచినప్పుడు బ్యాక్టీరియాగా మార్పు చెందుతుంది.దాని తర్వాత ఆ బ్యాక్టీరియా అనేది శరీరంలోకి వెళ్తుంది.అప్పుడే మీకు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది.అందుకే అన్నాన్ని రూమ్ టెంపరేచర్ వద్ద ఎక్కువ సమయం పెట్టకూడదు.

Telugu Care Full, Care, Tips, Rainy Season, Yesterdays Curd-Latest News - Telugu

అన్నం అనేది ఎక్కువ టైమ్ నిల్వ ఉంచితే బ్యాక్టిరీయా అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.ఆ సమయంలో అన్నాన్ని తినకూడదు.సాధారణంగా అన్నం వండిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలలోపు ఆ అన్నాన్ని తినాలి.ఈ విషయాన్ని నిపుణులు పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు.ఒకవేళ మీరు అలా చేయకపోతే దానిని ఫ్రిజ్‌లో పెట్టి అయినా కొన్ని గంటల తర్వాత వేడి చేసుకుని తినొచ్చు.అప్పుడు ఆ అన్నం తాజాగా ఉంటుంది.

అంతేకాదు ఆ అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube