వెక్కిళ్లు తగ్గడం కోసం యాలకులతో ఇలా చేయండి!

యాలకులు. మనకు ఈ పేరు వినగానే సువాసన పలుకులు గుర్తుకొస్తాయి.

 Follow These Tips Using Cardamom To Reduce Barking, Health Care, Health Tips, He-TeluguStop.com

వీటిని కేవలం మధురమైన సువాసన కోసమే వంటల్లో వాడాలని చాలా మంది భావిస్తుంటారు.నిజానికి సువాసన ద్రవ్యాలుగా పిలిచే యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి.

అందుకే యాలకులను అనేక ఆయుర్వేద మందులలో విరివిగా వాడుతుంటారు.అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యాలకులు ఎంతగానో తోడ్పడతాయి.వీటిని తినడం ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1.వెక్కిళ్లతో బాధపడే వారికి యాలకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.వీరు 2 యాలకులను చితక్కొట్టి దాంట్లో పుదినా ఆకులు వేసి.ఆ మిశ్రమాన్ని అర గ్లాసు నీటిలో కలపాలి.అనంతరం వాటిని బాగా కాచి వడకట్టాలి.కాస్త చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగడం ద్వారా వెక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి.

2.శరీరంలో నిస్సత్తువను పోగొట్టి ఆకలిని మెరుగుపరచడంలో యాలుకలు కీలక భూమిక పోషిస్తాయి.ముఖ్యంగా వీటిని తినడం వల్ల కడుపు నొప్పి మటుమాయం అవుతుంది.అలాగే జీర్ణక్రియ శక్తి బలోపేతమవుతుంది.నోటి దుర్వాసనతో బాధపడేవారికి యాలకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

Telugu Benefits Yoke, Ache, Benifits, Care, Tips, Ups, Latest, Reduce, Telugu Ti

3.మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న వారు యాలుకల టీ తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.

4.కొందరు ఎండలో ఎక్కువగా తిరిగే తలనొప్పి వాంతులు కొని తెచ్చుకుంటారు.ఇలాంటి సమయంలో నాలుగైదు యాలకులను నమిలితే చాలు తలనొప్పి సమస్య తగ్గిపోతుంది.

Telugu Benefits Yoke, Ache, Benifits, Care, Tips, Ups, Latest, Reduce, Telugu Ti

5.చాలామంది తల తిరుగుడు తో బాధపడుతుంటారు.ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతున్నారు.మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే నాలుగైదు యాలక్కాయలను తీసుకోండి.వీటిని బాగా చితక్కొట్టి హాఫ్ గ్లాస్ నీటిలో కలపండి.తర్వాత ఆ మిశ్రమాన్ని కషాయంలా కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగండి.

దగ్గు జలుబు కి కూడా యాలకులు మంచిగా పని చేస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube