ల్యాప్​టాప్​ హీట్ ఎక్కుతోందా.. అయితే ఇలా చేయండి..

ఈ రోజుల్లో విద్యార్థులు, ఉద్యోగులు ఇలా చాలా మందికి ల్యాప్‌టాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల, ఆఫీస్‌ వర్క్‌ల కోసం చాలామంది ల్యాప్‌టాప్‌లపైనే ఆధారపడ్డారు.

 Follow These Tips To Protect Your Laptop From Over Heating Details, Laptap, Heat-TeluguStop.com

అయితే ఎక్కువ సేపు వాడటం వల్ల ల్యాప్‌టాప్‌లు హీట్ ఎక్కొచ్చు.ఇవి బాగా వేడెక్కితే అందులోని సున్నితమైన భాగాలు కాలిపోయే ప్రమాదం ఉంది.నిజానికి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ల్యాపీలు కాలిపోతుంటాయి.అయితే ల్యాప్‌టాప్‌లు కాలిపోయేంత వేడెక్కకుండా అందులోని కూలింగ్ ఫ్యాన్‌లు ఎప్పటికప్పుడు చల్లదనాన్ని అందిస్తుంటాయి.అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు ఈ ఫ్యాన్లలోకి దుమ్ము, ధూళి కణాలు చేరుకుంటాయి.దీని వల్ల ఆ ఫ్యాన్ల పనితీరుపై ప్రభావం పడుతుంది.

అలా ఫ్యాన్లు కావలసిన కూలింగ్‌ను ల్యాప్‌టాప్‌లకు అందించలేకపోతుంటాయి.ఫలితంగా ల్యాప్‌టాప్‌ల్లోని కాంపోనెంట్స్ కాలిపోతాయి.

మరి ల్యాప్‌టాప్‌లు హీట్ ఎక్కకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్‌ టర్న్ ఆన్ చేయగానే అందులోని కూలింగ్ ఫ్యాన్లు వేగంగా తిరుగుతున్నట్టు శబ్దం వినిపిస్తే వాటి పనితీరు తగ్గినట్లు మీరు అర్థం చేసుకోవాలి.

దీనివల్ల ల్యాపీ ఎక్కువ హీట్ అవుతుందని గుర్తించాలి.ల్యాప్‌టాప్‌ వేడెక్కుతుందని గమనించగానే మీరు కూలింగ్ ఫ్యాన్లను క్లీన్ చేసుకోవాలి.

సీపీయూ, జీపీయూ పార్టులకు కూలింగ్‌ను అందించే ఫ్యాన్స్ లోకి డస్ట్ చేరితే ఫ్యాన్లు పాడైపోతాయి.అలాగే ఈ దుమ్ము అనేది ఎయిర్‌ఫ్లోకు నిరోధకంగా మారి హీట్ పెంచుతుంది.

అయితే వీటిని శుభ్రం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.

క్లీన్ చేసే ముందు ల్యాప్‌టాప్‌ను ఆఫ్ చేసి కేబుల్స్‌, బ్యాటరీని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి.ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ బ్యాక్ ఓపెన్ చేసి అందులోని ఫ్యాన్లను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లో ముంచిన దూదితో క్లీన్ చేసుకోవాలి.ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్ అనేది ల్యాప్‌టాప్‌లోని కాంపోనెంట్స్‌పై తడిగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

లేదంటే అవి పాడయ్యే ప్రమాదం ఉంది.అతి తక్కువ ప్రెజర్‌ ఉన్న ఎయిర్‌ పంప్‌ల సాయంతో కూలింగ్‌ ఫ్యాన్‌లు క్లీన్ చేసుకోవచ్చు.

అలాగే ల్యాప్‌టాప్‌ ఎగ్జాస్ట్‌, వెంటిలేటర్లను సాఫ్ట్ బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే ల్యాప్‌టాప్‌ వేడెక్కదు.

Simple Tips To Keep Your Laptop from Overheating

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube