మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు.దీనివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అధికంగా కొవ్వు పెరగడం.మన శరీరంలో కొవ్వు అధికంగా ఉంటే బరువు తగ్గడం చాలా కష్టమైన పని.ఈ కొవ్వు ఉదరం, తొడలు, వెనక భాగాలలో పేరుకుపోవడం వల్ల చూడడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.ఇలాంటి కొవ్వును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వ్యాయామం, జిమ్ కి వెళ్లడం, డైట్ ఫాలో కావడం ఇలా ఎంతో కష్టపడుతున్నప్పటికీ, కొవ్వు కరగడం చాలా కష్టం.మరి ఇలాంటి వారికీ ఇది శుభవార్తే అని చెప్పాలి.
ఆహారం తినడం ద్వారా కొవ్వు కరుగుతుంది అన్న విషయం ఎంతో ఆశ్చర్యకరమైనది.మరి ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
మన శరీరంలో అధికంగా కొవ్వు పెరగడానికి గల ప్రధాన కారణం ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం.దీని ద్వారా శరీర భాగాలలో అధికంగా కొవ్వు పేరుకుపోయి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
మీరు తీసుకునే ఆహారంలో అధికంగా క్షారత స్వభావం కలిగి ఉండటం వల్ల శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.పసుపు లో ఉన్న కర్కుమిన్ కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అందువల్ల ఆహారంలో కొద్దిగా పసుపు జోడించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని వేడి నీటిలో బాగా మరిగించి ఆ కషాయంలోకి కొద్దిగా తేనెను జోడించి ఉదయం పరగడుపున తాగడం ద్వారా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను మొత్తం కరిగిస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ కలిగి ఉండడం వల్ల తొడలు, వెనుక భాగాన పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.అంతేకాకుండా ఓట్స్, బ్రోకలీ మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
గ్రీన్ టీ ఉదయం క్రమం తప్పకుండా తాగితే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వును కలిగిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించబడినది.అంతే కాకుండా శరీర బరువును తగ్గించే సామర్థ్యం కూడా కలిగి ఉంది.
ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా బర్గర్ వంటి ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా అధికంగా కొవ్వు పెరగడమే కాకుండా అనేక సమస్యలు తలెత్తుతాయి.