అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కాలు

ప్రతి ఒక్కరు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు.దాని కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు.

అలాగే ఎంతటి కష్టమైన పడతారు.అలాగే ఎన్నో రకాల మేకప్ చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు.

ఎన్నో కాస్మొటిక్స్ కొంటూ వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు.ఆలా కాకూండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అందం రెట్టింపు అవుతుంది.

మీరు ఒకసారి ట్రై చేయండి.నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.

Advertisement

అందువల్ల చర్మ సమస్యలకు బాగా సహాయపడుతుంది.ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.

అంతేకాక చర్మంలో PH స్థాయిలను పెంచి చర్మం ఆకర్షణీయంగా కన్పించేలా చేస్తుంది.జిడ్డు చర్మం ఉన్నవారికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది.

పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది.ఇది చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తుంది.

అంతేకాకుండా ఎటువంటి చర్మ సమస్యలు లేకుండా కాపాడుతుంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
ఏసీపీ చెంప పగలగొట్టిన ఆశా వర్కర్.. ఎందుకంటే?

కేరట్ లో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన, ప్రతి రోజు క్యారెట్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ వేసవిలో ఎండలోకి వెళ్లిన్నప్పుడు చర్మం కమిలిపోకుండా కాపాడుతుంది.అంతేకాక చర్మ ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.టమోటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది.

Advertisement

ఇది చర్మం కాంతివంతంగా కనపడటానికి చాలా బాగా సహాయపడుతుంది.పాలకూరలో విటమిన్ - ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు.చర్మాన్ని సాగకుండా కాపాడుతాయి.

అందుకే మీ రోజువారీ ఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోండి.

తాజా వార్తలు