వాట్సాప్ బాట్ ​తో మీ దగ్గరలోని వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండి ఇలా..!

ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశంలో సెకండ్ వేవ్ ఏవిధంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత పది రోజుల నుండి ఏకంగా మూడు లక్షలకు పైగా ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతుండడం గమనిస్తూనే ఉన్నాం.

 Follow These Steps To Find Nearest Covid Vaccination Center Using Whats App Bot-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే భారతదేశ ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో భాగంగానే తాజాగా వాట్సాప్ బాట్‌ ను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఈ వాట్సప్ బాట్ ను ఉపయోగించాలంటే దాని కోసం ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

 Follow These Steps To Find Nearest Covid Vaccination Center Using Whats App Bot-వాట్సాప్ బాట్ ​తో మీ దగ్గరలోని వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండి ఇలా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటిగా మీ స్మార్ట్ మొబైల్ లో +919013151515 నెంబర్ ను ఏదో ఒక పేరుతో సేవ్ చేసుకొని, ఆ నెంబర్ ను వాట్సాప్ లో ఓపెన్ చేసి నమస్తే అని మెసేజ్ పంపించాలి.

దీంతో వెంటనే My Gov Corona Helpdesk కి సంబంధించి ఆక్టివేట్ కాబడుతుంది.వెంటనే మీరు పంపించిన నెంబర్ కు గవర్నమెంట్ నుండి ఓ మెసేజ్ వస్తుంది.

అందులో పూర్తి సమాచారం సంబంధించి మొత్తం 9 నెంబర్లు ఉన్న విడివిడి సమాచారాన్ని పొందుపరచి ఉంటుంది.అందులో మీకు కావలసిన వివరాల కోసం నెంబర్ ని తిరిగి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది.ఇందులో భాగంగానే మీ దగ్గర్లోని కోవిద్ వాక్షిన్ సెంటర్స్ సమాచారం తెలుసుకోవాలంటే.1 అని రిప్లై ఇవ్వమని అడుగుతుంది.అలా 1 నెంబర్ ను రిప్లై ఇవ్వగానే మీ పిన్ కోడ్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది.అలా మీరు వెంటనే పిన్ కోడ్ సెండ్ చేస్తే మీ దగ్గరలో ఉన్న కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ల వివరాలను పక్కా సమాచారంతో మీకు అందజేయబడుతుంది.

ఆ మెసేజ్ లో కేవలం వ్యాక్సినేషన్ సెంటర్ వివరాలు మాత్రమే కాకుండా.వాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన లింకు కూడా పంపించబడుతుంది.

ఇక ఈ సంభాషణ మొత్తం కేవలం ఆంగ్ల భాషలో మాత్రమే కొనసాగింపబడుతుంది.ఇతర ఏ ప్రాంతీయ బాష కూడా ఈ వాట్సప్ బాట్ స్పందించదు.

కాబట్టి మీకు వాక్సినేషన్ సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్న ఈ విధంగా ప్రయత్నించి మీకు కావలసిన పూర్తి సమాచారాన్ని పొందండి.

#Pincode #Vaccine #UsingWhats #Whatsapp #NearestCovid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు