జీమెయిల్ లోని ఈమెయిల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా..?!

ఇప్పుడు చదువుకునేవాళ్లకు జీమెయిల్ అనేది కచ్చితంగా ఉండాల్సిందే.ఎందుకంటే జీమెయిల్ ద్వారానే కొన్ని కొన్ని పోటీ పరీక్షలకు అప్లై చేయాల్సి ఉంటుంది.

 Follow These Steps To Download Emails From The Gmail, Gmail Account, Gmail Downl-TeluguStop.com

అలాగే ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ నుంచి ప్రత్యేకమైన జీమెయిల్ అనేది ఉంటుంది.ఈ జీమెయిల్ ను మనం చాలా సార్లు మారుస్తూ వస్తాం.

స్కూల్ అయిపోయాక కాలేజీ టైంలో ఓసారి మార్చాల్సి వస్తుంది.అలాగే ఉద్యోగానికి ఒకటి ఉండాలి.

ఇంకొంత మంది అయితే స్పామ్ మెస్సేజులు ఎక్కువగా వస్తుండటం వల్ల కొత్త జీమెయిల్ ను ఓపెన్ చేసుకుంటారు.మరి ఇలా జీమెయిల్ ని మారుస్తున్నప్పుడు పాత అకౌంట్ లోని ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోయే అవకాశం ఉంటుంది.

పాత జీమెయిల్ నుంచి ఇంపార్టెంట్ ఈ- మెయిల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.అందుకే ఈ-మెయిల్స్ ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేయడం ఎంతో ఉత్తమం.

ఇప్పుడు ఈమెయిల్స్ ను నిమిషాల్లోనే డౌన్లోడ్ చేసుకోవడం ఎంతో సులభం.

మీరు ఈమెయిల్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా myaccount.google.com వెబ్ సైట్లోకి వెళ్లాలి.ఆ తర్వాత మీ జీమెయిల్ తో లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌ లో డేటా, పర్సనలైజేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.ఆ తర్వాత స్క్రోల్ డౌన్ చేసి Download లేదా delete your Data పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.అప్పుడు takeout.google.com సైట్ అనేది ఓపెన్ అవ్వడమే కాకుండా అందులో మీకు యాప్స్ లిస్టు అనేది చూపిస్తుంది.

Telugu Download, Email Tips, Emailsdownload, Enced, Gmail, Gmail Download, Gmail

అప్పుడు మీరు స్క్రోల్ డౌన్ చేశాక జీమెయిల్ ని ఎంపిక చేసుకోవాలి.‘మెయిల్‘ పక్కన ఉన్న చెక్ బాక్స్‌ ని టిక్ చేసి ‘All Mail Data Included‘ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.అక్కడ మీరు జీమెయిల్ డేటాలో ఏ సెక్షన్ డౌన్లోడ్ చేసుకోవాలో దాన్ని వదిలి ఇతర చెక్‌ బాక్స్‌ లను అన్ టిక్ చేయాలి.

ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేశాక ‘ Next Step ‘ పైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన డెలివరీ మెథడ్ ను ఆ తర్వాత ఎక్స్‌పోర్ట్ ఫ్రీక్వెన్సీని ఎంపిక చేసుకోవాలి.ఆ తర్వాత క్రియేట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రాసెస్ అయిన తర్వాత గూగుల్ మీ డేటాను జీమెయిల్ నుంచి తీసుకుని ముఖ్యమైన ఫైల్‌ లు డౌన్లోడ్ కు రెడీ అని మెయిల్ చేస్తుంది.అప్పుడు వచ్చిన ఈమెయిల్‌ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube