పవర్ బ్యాంకు వాడుతున్న వారు ఈ జాగ్రత్తలు పాటించండి..!

చాల మంది పవర్ బ్యాంకు ని వాడుతుంటారు.అయితే మీరు కూడా పవర్‌ బ్యాంక్‌ వాడుతున్నట్టయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

 Follow These Safety Rules If You Are Using A Power Bank ,  Powerbank, Using, Tip-TeluguStop.com

స్మార్ట్‌ ఫోన్‌ లో ఛార్జింగ్ లేనప్పుడు ఆదుకునే గ్యాడ్జెట్ పవర్ బ్యాంక్.స్మార్ట్‌ ఫోన్ యూజర్లు ఎప్పుడో ఒకప్పుడు పవర్ బ్యాంక్ ఉపయోగించి ఉంటారు.

ఎక్కువగా జర్నీ చేసేవాళ్లు తప్పనిసరిగా పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్తుంటారు.పవర్ బ్యాంకునే పోర్టబుల్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు.

స్మార్ట్‌ ఫోన్లు మాత్రమే కాదు ట్యాబ్లెట్స్, కెమెరాలు, స్మార్ట్‌ వాచ్‌ లు.ఇలా ఇతర గ్యాడ్జెట్స్ ని ఛార్జ్ చేయొచ్చు.

మీరు పవర్ బ్యాంక్ ఉపయోగిస్తున్నట్టైతే ఎప్పుడూ ఫుల్‌ గా ఛార్జ్ చేయండి.మీ స్మార్ట్‌ ఫోన్‌ లో బ్యాటరీ ఎంత ఉంటుందో దానికి రెండు రెట్లు పవర్ బ్యాంక్ ఉండేలా చూసుకోండి.

అయితే ఎక్కువగా జర్నీ చేస్తున్న, ఛార్జింగ్ అందుబాటులో లేకపోయినా పవర్ బ్యాంక్ కొనొచ్చు.అలాంటప్పుడు 20,000 mah కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవడం మంచిది.ఇంత భారీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకుతో భారీ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ ను 2 నుంచి 3 సార్లు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు.పవర్ బ్యాంక్ కొనేముందు స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి.

ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి.అంతేకాదు.

పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ కు ఎంత ఫాస్ట్‌ గా స్మార్ట్‌ ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి.సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి.

ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్‌ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి.

Telugu Mph, Battery Usage, Phone, Bank, Powerbank, Safety, Tips-Latest News - Te

అయితే పవర్ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుందన్న అంశం మీరు తీసుకున్న కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది.10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది.

ఇక మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌ తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు.పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు.మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది.ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి.

ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌ గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల లైఫ్ ఉంటుంది.రెగ్యులర్‌ గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube