మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలు అవుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పవు సుమీ..!

అప్పటి వరకు పాఠశాలకు వెళుతూ, పుస్తకాలతో ఆటలతో కాలం గడిపేస్తున్న పిల్లలకు ఒక్కసారిగా లాక్ డౌన్ రావడంతో వాళ్ల జీవితాలు మారి పోయాయి.కరోనా నిబంధనల మేరకు పాఠశాలలు లేకపోవడంతో పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు ఆన్లైన్ క్లాసులు పేరుతో మొబైల్ ఫోన్లను పట్టుకోవాల్సి వచ్చింది.

 Follow These Safety Measures If You Think Your Children Addicted To Online Games-TeluguStop.com

అయితే పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్లైన్ క్లాసులు పేరు చెప్పి గేమ్స్ ఆడుతూ బానిసలవుతున్నారు.దీంతో పిల్లల శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

లాక్‌డౌన్‌ సమయంలో ఆన్లైన్ గేమ్స్ కు బానిసలైన పిల్లల జీవితాలు ఎలా తారుమారయ్యాయో కొందరు విద్యార్థులు చూస్తే అర్థమవుతుంది.

ఓ 14 ఏళ్ల కుర్రాడు అందరితో కలిసిపోయి, జోకులు వేస్తూ సరదాగా తిరిగేవాడు.

అయితే గతేడాదిలో స్కూలు మూతపడడంతో ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసులు వినడానికి తల్లిదండ్రులు స్మార్ట్ మొబైల్ ఫోను కొనిచ్చారు.అప్పటివరకు ఫోన్ ముట్టుకుంటేనే కోప్పడిన తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ వాడకానికి అనుమతించారు.

కానీ ఆ కుర్రాడు ఆన్లైన్ క్లాసులు పేరుతో నాలుగైదు గంటలు, తర్వాత చదువుకునే పేరుతో మరికొన్ని గంటల్లో ఫోన్ చేతిలో ఉండడంతో ఆ ఫోన్ కు బానిస అయిపోయాడు.రాత్రిపూట నిద్రపోకుండా గంటలు గంటలు ఫోన్లో గేమ్స్ ఆడుతూ బానిస అయి పోయాడు.

ఇతరులతో మాట్లాడటం తగ్గించాడు.చదువులో వెనుకబడ్డాడు.

కోపం అసహనం పెరిగిపోయాయి.తల్లి దండ్రుల మాటకు ఎదురు చెప్పడం ప్రారంభించాడు.

ఆన్లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా ఏడాదిన్నర వ్యవధిలో అతనిలోని మార్పులతో తన జీవితం పతనమైంది.తన ప్రవర్తనతో కలత చెందిన తల్లిదండ్రులు అతన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ కు తీసుకెళ్లగా.

అక్కడ టెక్నాలజీకి బానిసలైన వారికోసం సర్వీసెస్ ఫర్ హెల్ది యూజ్ ఆఫ్ టెక్నాలజీ క్లినిక్ లో అతడికి చికిత్స చేయించారు.

గతంలో తాము ఇలాంటి కేసులు వారానికి రెండు మూడు చూసేవారని ఇప్పుడు వారానికి 15 కేసులు దాకా వస్తున్నాయని వారిలో ఎక్కువ మంది కౌమార ప్రాయంలో ఉన్న వారే అని క్లిక్ సమన్వయకర్త ఒకరు తెలిపారు.అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని మొబైల్ వాడోద్దని వారిస్తే ఆ కోపంలో ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారని ఆందోళన వెలిబుచ్చారు.

ఇలా పిల్లల్లో గేమ్ వ్యసనం పెరిగిపోతుండడంతో చైనా కఠిన చర్యలకు నడుంబిగించింది.18 లోపు వారు వారానికి మూడు గంటలకు మించి ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా పరిమితి విధించింది.అలా ఆన్లైన్ లో మూడు గంటలకు మించి గేమ్స్ ఆడకుండా చూసుకునే బాధ్యత గేమింగ్ కంపెనీల పైనే పెట్టింది.

అలాగే ఢిల్లీ సర్కార్ కూడా పిల్లల్లో ఆన్లైన్ గేమ్స్ నిరోధించడానికి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.గేమింగ్ వ్యసనం వల్ల కలిగే శారీరక మానసిక అనారోగ్య సమస్యల గురించి పిల్లలకు పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పాలని సూచించింది.

పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా కొద్దిసేపు ఆడితే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు పేర్కొంది.

కాగా లోక్డౌన్ సమయం తరువాత పిల్లల్లో ఒకరోజు ఆన్లైన్ గేమ్స్ కోసం వెచ్చిస్తున్న సమయం 218 నిమిషాలు అంటే దాదాపుగా మూడున్నర గంటలు.అలాగే మనదేశంలో వివిధ డిజిటల్ పరికరాలు డౌన్లోడ్ అయినా ఆన్లైన్ గేమ్ ల సంఖ్య 700 కోట్లు.గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న 30 లక్షలకు పైగా యాప్స్ ఉన్నాయి.2020లో మనదేశంలో ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య 365 కోట్లు కాగా 2018 సంఖ్య 26.19 కోట్లుగా ఉండేది.2022 నాటికి ఈ సంఖ్య 51 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు.

Follow These Safety Measures If You Think Your Children Addicted To Online Games, Online Games, Addict, Kids, Social Media, Playing Games, Tips, Care , Latest News, Children Addicted To Online Games, National Institute Of Mental Health, Measures For Game Addicted Children - Telugu Addict, Care, Games, Latest, Game, Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube