కార్తీకమాసంలో ఈ నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుంది!

మన హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.కార్తీకమాసం అంటేనే భక్తులు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో నిమగ్నమవుతారు.

 Follow These Rules In Kartikam Everything Will Be Fine Karthika Masam, Pooja, Lakshmi Devi, Srimannarayana, Brahma Muhurtham-TeluguStop.com

ఈ క్రమంలోనే కార్తీకమాసంలో ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొంటూ దేవుడు ఆశీస్సులు పొందుతారు.కార్తీక మాసం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన మాసం.

ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శ్రీహరిని లక్ష్మిని పూజించడం వల్ల అధిక సంపద కలుగుతుంది భావిస్తారు.

 Follow These Rules In Kartikam Everything Will Be Fine Karthika Masam, Pooja, Lakshmi Devi, Srimannarayana, Brahma Muhurtham-కార్తీకమాసంలో ఈ నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీమన్నారాయణుడు నాలుగు నెలల నిద్ర అనంతరం మేలు కోవడంతో చాతుర్మాస ముగిసిపోతుంది.

అప్పటి నుంచి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతో అనువైన మాసం అని చెప్పవచ్చు.ఈ మాసంలోనే సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి పైకి వస్తుందని భావిస్తారు .ఇలా ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Telugu Karthika Masam, Lakshmi Devi, Pooja, Srimannarayana-Telugu Bhakthi

కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పారుతున్న నీటిలో స్నానం చేయడం ఎంతో మంచిది.ఇలా స్నానం చేసిన వెంటనే ఇంటిలో పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి.ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయటం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి.

అదేవిధంగా కార్తీక మాసంలో తులసి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తులసి కోట ముందు దీపారాధన చేసి తులసి చెట్టుకు నమస్కారం చేయాలి.

అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి తులసినీ లక్ష్మీదేవిగా భావిస్తారు.ఈ క్రమంలోనే వీటికి వివాహాన్ని కూడా జరిపిస్తారు.

అలాగే ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.మన స్థాయి కొద్ది దానధర్మాలను చేయటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube