EPF అకౌంట్‌లో ఫోటో అప్‌లోడ్‌ చేయడం మర్చిపోవద్దు.. లేదంటే డబ్బులు రావు?

EPFO (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) PF చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది.నేడు సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకు పెరుగుతుండటం వల్ల వివిధ పనుల నిమిత్తం PF కార్యాలయానికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉండి చేసుకునే అవకాశాన్ని కల్పించే విషయం అందరికీ తెలిసినదే.

 Follow These Procedure To Upload Photo Into Your Epf Account-TeluguStop.com

అయితే PF నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్‌ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.ఒకవేళ మీరు ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేయడం కుదరదు.

అందువలన PF ఖాతాదారులు ఈ-నామినేషన్‌ ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.అయితే కొంతమంది ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా, అది పూర్తి కావడం లేదంటే దానికి గల కారణాలను గమనించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ప్రొఫైల్‌ను ఇక్కడ అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే, ఈ-నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

అదెలాగో ఇపుడు తెలుసుకుందాం:

Telugu Amount, Creadit, Epfo, Upload, Profile, Upload Pf-Latest News - Telugu

1.ముందుగా UAN నెంబర్‌ IDతో EPF పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి.

2.ఆ తర్వాత మెనూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే అక్కడ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

3.ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసిన తరువాత వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.

4.ఇపుడు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది.అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను మార్చడం, లేదా అప్‌లోడ్‌ చేయడం చేయాలి.

5.2 చెవులు కనిపించేలా ఫోటో విజువల్‌ చాలా క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి.ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్‌లో మాత్రమే సేవ్‌ చేయాలి.

6.ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి.దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube