సారంగదరియాకి మంగ్లీ గొంతు బాగోలేదు... నేనే పాడతా: ఒరిజినల్ గాయని కోమలి

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో జానపద పాటల జోరు పెరిగింది.ప్రాంతీయతని ఎలివేట్ చేసే విధంగా ఉండాలని ఒకప్పటి జానపదాలకి సినిమాటిక్ స్టైల్ ఇచ్చి సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు.

 Folk Singer Komali Demand Over Saranga Dariya Song Controversy, Tollywood, Loves-TeluguStop.com

దీంతో ఈ పాటలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

మరిచిపోయిన జానపదానికి ఇలా మన దర్శకులు గుర్తుకుచేయడమే కాకుండా జానపద పాటలు అంటే ఇష్టపడే వారికి సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో తెలంగాణ జానపద పాటలపై ఆల్బమ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి.

చాలా మంది టాలెంటెడ్ గాయకులు తమ జానపదాలని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది చేరువ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా లవ్ స్టొరీ కోసం తెలంగాణలో భాగా పాపులర్ అయిన సారంగదరియా అనే జానపదాన్ని ఉపయోగించుకున్నారు.

ముందు లైన్స్ తీసుకొని దానికి సుద్దాల అశోక్ తేజతో చరణాలు కొత్తగా రాయించి సరికొత్తగా తెరపై ఆవిష్కరించారు.ఈ పాటకి సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ తోడవడంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ లో దూసుకుపోతుంది.

ఇప్పటికే 25 మిలియన్స్ మార్క్ ని ఈ సాంగ్ క్రాస్ చేసేసింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సాంగ్ తనదే అంటూ తనతోనే పాడించాలని జానపదగాయని కోమలి మీడియా ముందుకొచ్చింది.

కొద్ది రోజుల క్రితం ఈ గొడవ స్టార్ట్ అయ్యింది.మరుగున పడిన ఈ పాటని రేలా రేలా ద్వారా కోమలి బయటకి తెచ్చింది.అయితే అప్పట్లో అనుకున్న స్థాయిలో ఈ సాంగ్ గుర్తింపు పొందలేదు.అయితే శేఖర్ కమ్ముల లవ్ స్టొరీలో ఉపయోగించడం వలన ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది.

దీంతో ఒరిజినల్ పాడిన గాయని ఇప్పుడు ఈ సాంగ్ నేనే వెలుగులోకి తీసుకొచ్చా కాబట్టి నాతోనే పాడించాలని రచ్చ చేస్తుంది.తనకి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా సుద్దాల అశోక్ తేజ మోసం చేస్తున్నారని మీడియాలో హడావిడి చేస్తుంది.

జానపదాలు ఎవరి సొత్తు కాదని, వాటి మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని సుద్దాల అశోక్ తేజ క్లారిటీ ఇచ్చిన కోమలి మాత్రం వెనక్కి తగ్గలేదు.ఈ పాటకి మంగ్లీ గొంతు బాగోలేదని, తన గొంతే బాగుంటుందని, నేనే పాడుతా అంటుంది.

మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube