బాహుబలికి సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చింది వీళ్లేనట.. వారి బ్యాగ్రౌండ్ ఏంటంటే?

సాధారణంగా మనం సినిమా చూస్తున్నప్పుడు అందులో బ్యాక్ గ్రౌండ్ అనేక రకాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.సినిమాలలో ఆ శబ్దం లేకపోతే చూడడానికి కూడా అసలు ఇష్టపడరు.

 Foley Artists Behind Bahubali Movie Foley Artists, Baahubali Movie, Baahubali, T-TeluguStop.com

సాధారణంగానే సినిమా అంటే కనిపించే సన్నివేశాలతో పాటు ఆ కదిలే దృశ్యాలకు తగ్గట్టుగా వెనుక వచ్చే చప్పుళ్లు కూడా ఉండాలి.ఇక సినిమాలలో చిన్న గాలికి పేపర్ ఎగరడం నుంచి పక్షుల అరుపులు అలాగే హీరో నడకల శబ్దాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా కీలకం అని చెప్పవచ్చు.

సినిమాలో అటువంటి శబ్దాలు లేకపోతే ప్రేక్షకులకు సినిమాను చూసిన అనుభూతి ఉండదు.

సినిమాలో కూడా రియలిస్టిక్ గా ఉండటం కోసం నిజంగానే శబ్దాలు చేస్తారు.

సౌండ్ ఎఫెక్టుల కోసం ప్రత్యేకంగా స్టూడియోలు, మనుషులు, పెద్ద సెటప్పే ఉంటుంది.బాహుబలి సినిమాలో గుర్రం పరిగెడుతుంటే వచ్చే కాళ్ళ చప్పుళ్ళు, గుర్రపు డెక్కల సౌండ్లు, గాల్లో ఎగిరే పక్షుల శబ్దాలు ఇలా పాత్రలు మాట్లాడుతుంటే వెనుక వచ్చే శబ్దాలను సమర్ధవంతంగా రికార్డు చేసే వారిని ఫోలీ ఆర్టిస్టులు అంటారు.

ఈ ఫోలీ ఆర్టిస్టులు మనం ప్రతిరోజు ఉపయోగించే వస్తువులతోనే సినిమాలలో సౌండ్ ఎఫెక్ట్స్ ను అందిస్తూ ఉంటారు.

Telugu Baahubali, Foley, Sound, Tollywood-Movie

అలా ఫోలి ఆర్టిస్టులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరణ్ అర్జున్ సింగ్.ఇతను సినిమాలలో సన్నివేశాలకు తగ్గట్టుగా సౌండ్స్ ని అందిస్తూ ఉంటాడు.ఎలాంటి శబ్దాన్ని అయినా కూడా అవలీలగా చేసి చూపిస్తూ ఉంటాడు.

అయితే శబ్దాలను సృష్టించడం కోసం వీరు ఎక్కువగా పనికిరాని వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగిస్తూ ఉంటారు.అయితే బాహుబలి సినిమా కోసం ఈ ఫోలీ ఆర్టిస్టులు ఎంత అద్భుతంగా శద్దాలు చేస్తారో అన్నదానికి ఈ వీడియో నిదర్శనం.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube