మడత పెట్టుకునే టీవీలు వచ్చేస్తున్నాయ్ !  

Folding Tvs Are Coming Developed By Lg-

అప్పట్ల ఓ డబ్బా టీవీని కొంటే ఎన్నెన్ని తిప్పలు పడాల్సొచ్చేదో.టీవీతో పాటు స్టెబిలైజర్‌, స్టాండు కూడా కొనాల్సొచ్చేది.తీరా ఇంటికి తీసుకొచ్చినంక, ఎక్కడ పెట్టాలన్నది పెద్ద పనే.ఇక, అది ఖరాబైతే దాన్ని తీసుకెళ్లాలంటే ఎన్నెన్ని ఇబ్బందులో.ఇప్పుడొస్తున్న ఫ్లాట్‌ ఎల్‌ ఈడీ టీవీలను గోడలకు తగిలించుకుంటే సరిపోతుండే.మరి, దాని కన్నా అడ్వాన్స్‌‌‌‌ టెక్నాలజీ టీవీలొస్తే.ఇంతకన్నా అడ్వాన్స్‌‌‌‌ ఏముంటదనుకుంటున్నారా? ఎంచక్కా చాపలా చుట్టేసి పెట్టేస్తే.టీవీని చుట్టచుట్టడమా? అవును, ఎల్జీ అలాంటి టీవీనే ఇప్పుడు మార్కెట్లోకి విడుదల చేసింది.

Folding Tvs Are Coming Developed By Lg--Folding TVs Are Coming Developed By Lg-

నిజానికి 2016లోనే ఎల్జీ ఈ తరహా టీవీల గురించి ప్రకటించింది.18 అంగుళాల టీవీని తీసుకొచ్చింది.ఇప్పుడు చుట్టేసి పెట్టేలా 65 ఇంచెస్ పెద్ద టీవీని తయారు చేసింది.ప్రపంచంలో చుట్టుచుట్టి పెట్టుకునే మొట్టమొదటి టీవీ ఎల్జీనే.అవసరం లేనప్పుడు చుట్టుచుట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు.ఎంత చుట్టినా పాడుకాకపోవడం దీని మరో ప్రత్యేకత.రిమోట్‌తో పనిలేకుండా వాయిస్‌ కమాండ్స్‌‌‌‌తోనే దాన్ని ఆపరేట్‌ చేయొచ్చు.అందుకు గూగుల్‌ అసిస్టెంట్‌ ను ఇందులో పొందుపరిచారు.55 నుంచి 77 అంగుళాల సైజుల్లో ఐదు మోడళ్లను అందుబాటులోకి తెస్తోంది సంస్థ.ధర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పింది సంస్థ.